- Telugu News Photo Gallery Beta Carotene For Hair: These 3 Beta Carotene Rich Foods Helps In Hair Growth
Beta Carotene For Hair: ఈ మూడింటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
కేవలం షాంపూ, కండీషనర్ రాసుకోవడం వల్ల జుట్టుకు కావల్సిన పోషణ అందదు. షాంపూ జుట్టు, తలపై ఉన్న మురికిని మాత్రమే శుభ్రపరుస్తుంది. జుట్టుకు పోషణ అందించి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఏకైక సాధనం ఆహారం మాత్రమే. పౌష్టికాహారం శరీరాన్ని కాపాడుకోవడమే కాదు, జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో పోషకాల లోపం తలెత్తితే జుట్టు రాలడం సమస్య ఎప్పటికీ ఆగదు..
Updated on: Jun 30, 2024 | 9:19 PM

కేవలం షాంపూ, కండీషనర్ రాసుకోవడం వల్ల జుట్టుకు కావల్సిన పోషణ అందదు. షాంపూ జుట్టు, తలపై ఉన్న మురికిని మాత్రమే శుభ్రపరుస్తుంది. జుట్టుకు పోషణ అందించి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఏకైక సాధనం ఆహారం మాత్రమే. పౌష్టికాహారం శరీరాన్ని కాపాడుకోవడమే కాదు, జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో పోషకాల లోపం తలెత్తితే జుట్టు రాలడం సమస్య ఎప్పటికీ ఆగదు.

విటమిన్ బి, ఇ, బయోటిన్, ఐరన్ వంటి పోషకాలు జుట్టు సంరక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. వీటిల్లో అత్యంత ఉపయోగకరమైనది బయోటిన్. అదేనండి బీటా-కెరోటిన్. బీటా కెరోటిన్ జుట్టు సంరక్షణలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ పోషకం విటమిన్ ఎ నుంచి వస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, కంటి చూపును, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. ఈ పోషకం స్కాల్ప్ సమస్యలను తొలగించి, సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. చిలగడదుంపలలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో బీటా కెరోటిన్‌తో పాటు ఐరన్, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

క్యాప్సికమ్‌లో బీటా కెరోటిన్, విటమిన్ సి ఉంటాయి. ఇది తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా అకాలంగా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

క్యారెట్‌లో కూడా బీటా కెరోటిన్ ఉంటుంది. జుట్టు కోసం క్యారెట్ తినడం వల్ల శిరోజాలకు సంబంధించిన సమస్యలన్నీ నివారించవచ్చు. క్యారెట్ తినడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. తద్వారా జుట్టు రాలే సమస్యను దూరం చేసుకోవచ్చు.




