AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nail Health Chart: మీ గోర్లపై నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే..

శరీరంలో ఏదైనా సమస్య ఉంటే దాని లక్షణాలు గోళ్లలో కనిపిస్తాయి. అందుకే గోళ్లపై ఎల్లప్పుడూ నిఘా ఉంచడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది గోళ్లపై శ్రద్ధ పెట్టరు. శరీరంలో ఏదైనా సమస్య తలెత్తితే మొదట మన గోళ్ళలో వాటి లక్షణాలు ప్రతిబింబిస్తాయి. గోర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అవి మృదువుగా కనిపిస్తాయి. గోరు రంగు లేత గులాబీ రంగులో ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ గోర్లు పెళుసుగా మారతాయి. వాటి మెరుపును కోల్పోతాయి. .

Srilakshmi C
|

Updated on: May 03, 2024 | 8:58 PM

Share
శరీరంలో ఏదైనా సమస్య ఉంటే దాని లక్షణాలు గోళ్లలో కనిపిస్తాయి. అందుకే గోళ్లపై ఎల్లప్పుడూ నిఘా ఉంచడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది గోళ్లపై శ్రద్ధ పెట్టరు. శరీరంలో ఏదైనా సమస్య తలెత్తితే మొదట మన గోళ్ళలో వాటి లక్షణాలు ప్రతిబింబిస్తాయి.

1 / 5
గోర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అవి మృదువుగా కనిపిస్తాయి. గోరు రంగు లేత గులాబీ రంగులో ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ గోర్లు పెళుసుగా మారతాయి. వాటి మెరుపును కోల్పోతాయి. కానీ శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తితే గోరు మార్పులు భిన్నంగా ఉండవచ్చు. చిన్న వయస్సులో కూడా ఇలా జరగవచ్చు. గోరు ఆకారం, రంగులో ఈ కింది మార్పులు వస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.

2 / 5
గోర్లు పలచగా కనిపిస్తే శరీరంలో ఐరన్‌ లోపం ఉందని అర్థం చేసుకోవాలి. చాలా సార్లు గోరుపై ఎటువంటి గాయం లేకపోయినా పగిలిపోతుంటాయి.ఫంగల్ ఇన్ఫెక్షన్, హైపర్ థైరాయిడిజం వల్ల కూడా ఇలా జరుగుతుంది.

3 / 5
గోరుపై ఏ బరువు పడకపోయినా.. గోరు నొప్పి లేకుండా వీటి రంగు నల్లగా మారిందా? అయితే త్వరగా వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే మూత్రపిండాల సమస్యలున్న వారిలో ఇలా జరుగుతుంది.

4 / 5
గోరు రంగు నెమ్మదిగా పసుపు రంగులోకి మారుతుందా? ఇలా జరిగినా వైద్యుడిని సంప్రదించాలి. ఇలా లింఫెడెమా అనే వ్యాధి వల్ల జరుగుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల సమస్యల కారణంగా కూడా గోళ్ళ రంగు పసుపు రంగులో ఉంటుంది.

5 / 5
Follow Us