అయితే నల్ల జీలకర్ర (కలోంజి)ని తేనెతో కలిపి తింటే ఇంతకు రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చట. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 8-10 జీలకర్ర గింజలను ఒక చెంచా తేనెతో కలుపుకుని సేవిస్తే శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల తేనె, నల్ల జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. అంతేకాదు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇది గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.