Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేదు అని చిన్నచూపు చూడకండి.. వేపతో వెలకట్టలేనన్ని ప్రయోజనాలు

వేపాకు అనేది అందరికీ సులభంగా దొరకుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని చెబుతుంటారు. అనేక ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్క రుచి చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం అనేక ప్రయోజనాలు కలిగిస్తుందంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J

|

Updated on: Jun 09, 2025 | 1:45 PM

వేపాకులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అంతే కాకుండా దీనిని ఇప్పటికీ కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చర్మ వ్యాధులకు ఇది బెస్ట్ మెడిసన్. వేప చెట్టు చాలా రకాల రసాయన సమ్మేళనాలు కలిగి ఉంటుంది. వేప బెరడు నుంచి ఆకులు, పండ్లు, చివరకు వేరు వరకు ప్రతి ఒక్కటీ వివిధ వ్యాధుల నుంచి మానవులను కాపాడుతుందంట. అనేక రకాల చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. కాగా వేపతో కలిగే ప్రయోజనాలు చూద్దాం.

1 / 5
వేప క్యాన్సర్ కణాలను చంపడంలో ముందుంటుందంట. ప్రతి వ్యక్తి శరీరంలో క్యాన్సర్ కణాలు ఉండటం అనేది కామన్. అయితే అవి శరీరంలో వాటి స్థానంలో అవి ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొన్ని పరిస్థితులు, తీసుకుంటు్న ఆహారం వలన అవి అన్ని ఒక్కచోట చేరడతో అది తీవ్రమైన సమస్యగా మారుతుంది. అయితే వేపాకు తీసుకోవడం వలన ఇది శరీరంలోని క్యాన్సర్ కణాలు పెరగకుండా, నిర్ధిష్టపరిమితిలో ఉంచుతుందంట. దీని వలన క్యాన్సర్‌కు అడ్డుకట్టపడుతుంది.

2 / 5
శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నశింప చేయడంలో వేప ముందుం ఉంటుందంట.దీని ఆకులను మెత్తగా రుబ్బి ఆ పేస్ట్‌ను శరీరానికి రుద్ది కాసేపటి తర్వాత నీటితో కడిగి వేయాలి. దీని వలన చర్మసమస్యలు దూరం అవ్వడమే కాకుండా కాంతివంతంగా చేస్తుందంట. అలాగే ఇది యాంటీ బాక్టీరియల్ క్లెన్సర్ గా పని చేస్తుందంట. అంతే కాకుండా వేపాకు నీటితో స్నానం చేయడం వలన కూడా శరీరంలో బ్యాక్టీరియా నశిస్తుందని చెబుతున్నారు వైద్యనిపుణులు.

3 / 5
ఇక వేపాకును రసం చేసుకొని తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంట. దీని వలన ఇది శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం, గ్యాస్ , ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్ చెడు బ్యాక్టీరియాను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుందంట. అయితే వేపాకు రసంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని ఎక్కువమోతాదులో కాకుండా, మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

4 / 5
అదే విధంగా వేప గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివంట. వీటిని తినడం వలన ఇవి కడుపులోని నులిపురుగులను నశింపచేయడమే కాకుండా, పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే వేపాకు చర్మవ్యాధులు, కాలియన గాయాలు, జుట్టుసంరక్షణ, తలలోని పేలు వంటి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. అదే విధంగా వేప వేర్లలో కూడా అనేక ఔషధ గుణాలు ఉంటాయి, ఇవి క్యాన్సర్ నుంచి పోరాడే శక్తిని ఇస్తుంది.

5 / 5
Follow us