- Telugu News Photo Gallery Health Benefits of Living Caffeine: what will happen if you quit caffeine for a month body changes
Quitting Caffeine: ఒక్క నెల కాఫీ, టీ బంద్ చేస్తే శరీరంలో వచ్చే పెను మార్పులివే.. అస్సలు నమ్మలేరు తెలుసా.?
Quitting Caffeine: ప్రపంచంలోని బిలియన్ల మంది ఉదయాన్నే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగే వారి రోజును ప్రారంభిస్తారు. ఈ వేడి వేడి పానీయాలను ఇష్టపడే వారికి కొరతే లేదు. చికాకు అనిపించినా.. బాధ అనిపించినా..? తలనొప్పి.. అలసట.. నుంచి ఉపశమనం పొందేందుకు..
Updated on: Jul 15, 2023 | 6:20 AM

Quitting Caffeine: ప్రపంచంలోని బిలియన్ల మంది ఉదయాన్నే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగే వారి రోజును ప్రారంభిస్తారు. ఈ వేడి వేడి పానీయాలను ఇష్టపడే వారికి కొరతే లేదు. చికాకు అనిపించినా.. బాధ అనిపించినా..? తలనొప్పి.. అలసట.. నుంచి ఉపశమనం పొందేందుకు టీ లేదా కాఫీని రోజుకు చాలాసార్లు తీసుకుంటారు. ఇది మనస్సును రిఫ్రెష్ చేస్తుంది.. ఇంకా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

అయితే, టీ-కాఫీ మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇందులో కెఫిన్ ఉంటుంది. ఇవి శరీరానికి అనేక సమస్యలను కలిగిస్తాయి. ఈ డ్రింక్ ను కొద్దిరోజులు వదిలేయండి అని చెబితే.. ఎవ్వరూ వినరు.. ఇంకా అసాధ్యం కూడానూ.. ఎందుకంటే ఇది వ్యసనంగా మారింది. ఒక వ్యక్తి ఒక నెల పాటు టీ -కాఫీకి దూరంగా ఉంటే, అతని శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి..

రక్తపోటుపై నియంత్రణ: టీ - కాఫీ మనకు అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ.. ఇవి రక్తపోటును పెంచుతాయి. ఈ పానీయాలలో కెఫిన్ ఉంటుంది, కాబట్టి మీరు టీ-కాఫీని ఒక నెల పాటు తాగడం మానేస్తే మీ రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. ఇంకా అధిక బీపీ ఫిర్యాదు కూడా పోతుంది.

ప్రశాంతమైన నిద్ర: టీ - కాఫీ మానేయడం వల్ల మీ నిద్రపై సానుకూల ప్రభావం చూపుతుంది. మీరు మీ బాల్యంలో ఎంతసేపు నిద్రపోయారు.. పెద్దయ్యాక ఎంతసేపు నిద్రపోయారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.. కెఫిన్ పానీయాలకు అలవాటు పడిన తర్వాత నిద్రలో సమస్యలు మొదలయ్యాయి. టీ -కాఫీని మానేసిన వారంలో మీ నిద్రలో అద్భుతమైన మెరుగుదలని చూస్తారు. ఒక నెలలో మీరు పెద్ద వ్యత్యాసమే వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..

పళ్ళ ఆరోగ్యం: టీ-కాఫీ వంటి వేడి పదార్థాలు మన దంతాలకు చాలా హానికరం. ఇది వాటి రంగును తీసివేయడమే కాకుండా, వాటిని బలహీనపరుస్తాయి. మీరు ఒక నెల పాటు టీ -కాఫీ తాగడం మానేస్తే, మీరు మీ దంతాలకు పెద్ద నష్టం నుంచి రక్షించుకోవచ్చు. ఇంకా తెల్లదనం కూడా వస్తుంది. టీ-కాఫీలో ఆమ్లం ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌ను దెబ్బతీయడంతోపాటు బలహీనపరుస్తుంది.




