Indian Fig: పురుగులున్నాయని మేడిపండును దూరం పెడుతున్నారా..? అయితే పెద్ద తప్పు చేసినట్లే..!
మేడిపండు చూడు..మేలమై ఉండు..పొట్ట విప్పి చూడు పురుగులుండు.. ఈ వేమన శతకం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పద్యంలోని మేడి పండు చూసేందుకు అచ్చం అంజీర పండులాగే ఉంటుంది. కానీ, పొట్టనిండా పరుగులే నిండివుంటాయి. కానీ, ఈ పండును ఒక సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. మేడి పండు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మేడిపండు వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jul 08, 2025 | 8:34 PM

మేడిపండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పచ్చి పండ్లకు మధుమేహాన్ని దూరం చేసే శక్తి ఉంది.

మేడిపండులో పురుగులు ఉండడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల పురుగులే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అనేక పోషక విలువలు గల ఈ మేడిపండు తినేటప్పుడు జాగ్రత్తగా పురుగులు తీసి తినండి. అంతేగానీ, ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న ఈ పండు తినడం మానకూడదని నిపుణులు చెబుతున్నారు. మేడి పండ్లలో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది.

మేడిపండు..దీని హైబ్రిడ్ రకాలను అత్తిపండు, అంజీర అంటారు. మేడిపండు చూడడానికి గుండ్రంగా ఉంటుంది. పచ్చగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా, చేదుగా ఉండే మేడి పండు పండిన తరువాత పసుపు రంగులోకి మారుతుంది. అప్పుడు రుచి కూడా తియ్యగా ఉంటుంది. అయితే, నాటు పండయిన మేడిపండ్లలో పురుగులు ఉంటాయి.

మేడి పండ్లు, ఆకులు, బెరడు, వేర్లు ఔషధ సంపదగా పరిగణిస్తారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. కరోనా అనంతరం ప్రజలు మేడిపండును దాని కాండం, ఆకులు, పండ్లను విస్తృతంగా వినియోగించారు. దీని పండ్లు, ఆకులు, బెరడులు అంటువ్యాధులతో పోరాడే గొప్ప శక్తిని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మేడి పండ్లు తినటం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తినటం వల్ల వయసు పైబడిన లక్షణాలు బయటపడకుండా ఉంటాయి. వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, గొంతు నొప్పి, మంట, విరేచనాలను నయం చేయడానికి కూడా మేడిపండ్లు మంచి మందులా పనిచేస్తుంది. మేడి పండ్లలో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఈ లక్షణాలన్నింటినీ తొలగిస్తుంది. మీ జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది.




