Hair Care Tips: ఈ నూనె 3 నెలలు వాడితే జుట్టు రాలడం ఇట్టే ఆగిపోతుంది..! ఎలా వాడాలంటే..
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో నూనె ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే సంగతి చాలా మందికి తెలియదు. అయితే అన్ని నూనెలు అన్ని రకాల చర్మానికి ఉపయోగపడవు. చర్మ రకాన్ని బట్టి సరిపోయే నూనె వాడాలి. చర్మంపై ముడతల సమస్య వస్తే ప్రింరోజ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వినియోగించాలి..
Updated on: Jul 03, 2024 | 8:23 PM

Hair Care

చర్మం చాలా గరుకుగా, పొడిగా ఉండే వారికి కొబ్బరి నూనె ఉత్తమం. చర్మంతోపాటు, జుట్టును మృదువుగా మార్చడంలో కొబ్బరి నూనెకు మించిన ప్రత్యామ్నాయం లేదు.

మొటిమలతో సమస్యలు ఉంటే కామెల్లియా నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనె చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. దురద లేదా చికాకు కలిగించే చర్మానికి చికిత్స చేయడానికి టీ ట్రీ ఆయిల్‌ని ఉపయోగించవచ్చు. ఇది ఏ విధమైన చర్మ సమ్యలను తొలగించడంలోనూ సహాయపడుతుంది.

లావెండర్ ఆయిల్ చర్మంపై మచ్చలను తొలగించడానికి బాగా పనిచేస్తుంది. ఎండలోకి వెళ్లిన తర్వాత టాన్ వస్తే.. ఈ నూనెను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

రోజ్మేరీ ఆయిల్ కఠినమైన జుట్టు, చుండ్రు నివారణకు బలేగా పనిచేస్తుంది. రోజ్‌మేరీ ఆయిల్‌ను తలకు పట్టించే నూనెతో కలిపి రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. జుట్టు పల్చబడటానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆముదం నూనె ఉపయోగించవచ్చు. దీనిని మూడు నెలలు వాడితే ప్రయోజనం మీరే చూస్తారు.




