జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, పానీయాలపై అవగాహన ఉండాలి. ఆహారంలో విటమిన్ బి7, జింక్, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలు ఆరోగ్యకరమైన జుట్టును నిర్మించడంలో సహాయపడతాయి. ఎంత పోషకమైన ఆహారం తీసుకుంటే, జుట్టు అంత మెరిసిపోతుంది. అలాగే స్కాల్ప్ లో రక్తప్రసరణ సరిగా లేకున్నా జుట్టు సమస్యలు పెరుగుతాయి. రోజుకు కనీసం 5 నిమిషాల పాటు తలకు మసాజ్ చేసుకోవాలి. ఇది వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుంది. మూలాలకు ఆక్సిజన్ చేరుకుంటుంది. ఇది జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలోవెరా జెల్‌ను తలకు, జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రు, దురద సమస్యను తొలగిస్తాయి. అలోవెరా జెల్ సహజ హెయిర్ కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది.