Hair Care Tips: జుట్టు మృదువుగా, ఒత్తుగా పెరగాలంటే.. తలస్నానం చేసే ముందు ఇలా చేయండి
చలికాలం వచ్చిందంటే చుండ్రు సమస్య మొదలవుతుంది. జుట్టు పొడిబారి కరుకుదనం, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చుండ్రు వల్ల జుట్టు సహజమైన పటుత్వం కోల్పోతుంది. వాతావరణ కాలుష్యం మూలంగా శీతాకాలంలో జుట్టు త్వరగా మురికిగా మారుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు షాంపూ చేసుకుంటూ ఉండాలి. కానీ చాలా మంది చలికి భయపడి తలస్నానం చేసుకోరు. ఇది జుట్టులో ఎక్కువ మురికి పేరుకుపోయేలా చేస్తుంది..
Updated on: Jan 11, 2024 | 7:30 PM

చలికాలం వచ్చిందంటే చుండ్రు సమస్య మొదలవుతుంది. జుట్టు పొడిబారి కరుకుదనం, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చుండ్రు వల్ల జుట్టు సహజమైన పటుత్వం కోల్పోతుంది.

వాతావరణ కాలుష్యం మూలంగా శీతాకాలంలో జుట్టు త్వరగా మురికిగా మారుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు షాంపూ చేసుకుంటూ ఉండాలి. కానీ చాలా మంది చలికి భయపడి తలస్నానం చేసుకోరు. ఇది జుట్టులో ఎక్కువ మురికి పేరుకుపోయేలా చేస్తుంది.

పార్లర్‌లో రెగ్యులర్‌గా ట్రీట్‌మెంట్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, స్ట్రెయిట్‌గా, పొడవుగా కనిపిస్తుంది. కానీ ప్రతీసారీ పార్లర్‌లో ట్రీట్‌మెంట్ తీసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే డబ్బు ఖర్చుచేయవల్సి ఉంటుంది.

జుట్టు మెరుస్తూ ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. తలస్నానం చేసే రోజున.. రెండు చెంచాల కొబ్బరి నూనెలో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో 6 చుక్కల రోజ్మేరీ ఆయిల్ కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక చెంచా అలోవెరా జెల్ కలుపుకోవాలి

షాంపూ చేయడానికి ముందు ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకోవాలి. ఇది తలపై చుండ్రుని వదలగొట్టి, తల చర్మం శుభ్రంగా ఉండేలా చేస్తుంది. కనీసం 1 గంట పాటు అలాగే ఉంచుకుని, ఆ తర్వాత తలస్నానం చేసుకుంటే సరి.





























