- Telugu News Photo Gallery Hair Care Tips: How To Get Rid Of Oily Hair In The Summer, Follow These Tips
Summer Hair Care: వేసవిలో జుట్టు జిడ్డుగా మారుతోందా? పెరుగుతో ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి
వేసవి కాలంలో అధిక చెమట, ఉక్కపోత వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. తల స్నానం చేసినప్పటికీ ఒక్క రోజులోనే జుట్టు జిడ్డుగా మారుతుంది. వేసవిలో తేమ లేకపోవడం వల్ల జుట్టు అంద విహీణంగా మారుతుంది. పైగా కాలుష్యం, సరైన సంరక్షణ లేకపోవడం కూడా మరొక కారణం. అయితే ఈ సమస్యలను నివారించాలంటే ఈ కింది చిట్కాలను ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఆయిల్ హెయిర్, చెమట వల్ల జుట్టు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దాంతో పాటు జుట్టు రాలడం మొదలవుతుంది..
Updated on: Apr 07, 2024 | 9:09 PM

వేసవి కాలంలో అధిక చెమట, ఉక్కపోత వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. తల స్నానం చేసినప్పటికీ ఒక్క రోజులోనే జుట్టు జిడ్డుగా మారుతుంది. వేసవిలో తేమ లేకపోవడం వల్ల జుట్టు అంద విహీణంగా మారుతుంది. పైగా కాలుష్యం, సరైన సంరక్షణ లేకపోవడం కూడా మరొక కారణం. అయితే ఈ సమస్యలను నివారించాలంటే ఈ కింది చిట్కాలను ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు.

ఆయిల్ హెయిర్, చెమట వల్ల జుట్టు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దాంతో పాటు జుట్టు రాలడం మొదలవుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నకన్నా ఎలా వదిలించుకోవాలి అనేదానిపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. నిజానికి ప్రతి ఒక్కరి స్కాల్ప్ సహజంగా నూనెను ఉత్పత్తి చేస్తుంది. ఆ నూనె ఉత్పత్తి ఒక్కొక్కరిలో ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. ఆ నూనెను సెబమ్ అంటారు.

శరీరంలో సెబమ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల అదనపు నూనె వస్తుంది. దీని వెనుక ఇతర కారణాలు ఉండవచ్చు. కొన్ని రకాల షాంపూలు, కండిషనర్లు కూడా జుట్టును జిడ్డుగా మార్చుతాయి.

వీటిలో రసాయనాలు, పారాబెన్లు, సల్ఫేట్లు, పెట్రోలియం ఆధారిత పదార్థాలు ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇవి స్కాల్ప్‌లో సహజ నూనె స్థాయిలను పెంచుతాయి.

పెరుగును రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది. నిజానికి, పెరుగులో ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగు క్రమం తప్పకుండా తినడం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది.




