- Telugu News Photo Gallery Guntur: Gold yantra to be enshrined in Ayodhya Ram Mandir arrived at Vasudasa Ashram in Tenali, locals offered prayers
Andhra Pradesh: భక్తుల పూజలందుకున్న అయోధ్య బంగారు యంత్రం.. 14 కోట్ల రామ నామ జపంతో పూజలు!
అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో రామమందిరం ప్రారంభిస్తారన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే రామ మందిర నిర్మాణంలో భాగమయ్యేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సుముఖతతో ఉన్నారు. ఇందులో భాగంగానే రామ విగ్రహం అడగున ప్రతిష్టించనున్న బంగారు యంత్రం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లింది..
T Nagaraju | Edited By: Srilakshmi C
Updated on: Oct 09, 2023 | 7:26 PM

అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో రామమందిరం ప్రారంభిస్తారన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే రామ మందిర నిర్మాణంలో భాగమయ్యేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సుముఖతతో ఉన్నారు. ఇందులో భాగంగానే రామ విగ్రహం అడగున ప్రతిష్టించనున్న బంగారు యంత్రం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లింది.

చీరాలకు చెందిన చిదంబర శాస్త్రీ రామభక్తుడు... విగ్రహం అడుగున ప్రతిష్టించనున్న యంత్రాన్ని బంగారంతో తయారు చేయించారు. ఈ యంత్రానికి ఇప్పటి వరకూ 14 కోట్ల రామ నామ జపంతో పూజలు చేశారు.

ఆదివారం చీరాల నుంచి బంగారు యంత్రం తెనాలి మండలం అంగలకుదురులోని వాసుదాస ఆశ్రమానికి వచ్చింది. అక్కడ కొద్దీ సేపు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు.

అయోద్య రామమందిరంలో ప్రతిష్టించనున్న బంగారు యంత్రం తెనాలి మండలం అంగలకుదురులోని వాసుదాస ఆశ్రమానికి రావడంత స్థానికులు పూజలు చేశారు.

అనంతరం ఆ యంత్రాన్ని హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడి నుంచి అయోధ్యకు తీసుకెళ్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. నిన్నంతా అయోధ్య బంగారు యంత్రం అంగలకుదురులో ఉందని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి యంత్రాన్ని దర్శించుకొని పూజలు చేశారు.





























