AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold coins vs Jewellery: బంగారు ఆభరణాలు లేదా నాణేలు ఏది కొనడం ఉత్తమం..

బంగారంపై పెట్టుబడి పెడితే లాభాలే తప్ప నష్టాలు ఉండవని చాలా మంది అనుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరు బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అప్పుడు వారు, బంగారు ఆభరణాలను, లేదా బంగారు నాణేలు, లేదా బిస్కెట్లను ఎక్కువగా కొంటారు. కాబట్టి బంగారు ఆరభణాలు కొనడమా, లేదా బంగారు నాణెలు కొడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయా అనేది ఇక్కడ తెలుసుకుందాం

Anand T
|

Updated on: Oct 29, 2025 | 6:39 PM

Share
 చాలా మంది బంగారంపై ఇన్వెష్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా ఆభరణాలను కొంటూ ఉంటారు. ఇలా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే, మీరు 5 నుండి 30 శాతం మేకింగ్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీరు బంగారు ఆభరణాలను మార్పిడి చేసినప్పుడు లేదా విక్రయించినప్పుడు ఈ మేకింగ్ ఛార్జ్ మొత్తాన్ని తిరిగి పొందలేరు.

1 / 5
కానీ మీరు ఆభరణాలకు బదులుగా బంగారు నాణేలు లేదా బిస్కెట్లు కొనుగోలు చేస్తే.. మీరు ఎటువంటి అదనపు మేకింగ్ ఛార్జ్ లేదా ఇతర ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా మీరు దాన్ని అమ్మేయాలనుకున్న మీరు సేమ్ ప్రైజ్‌కు దాన్ని అమ్మవచ్చు.

2 / 5
రత్నాలు, ముత్యాలు, వజ్రాలు లేదా ఇతర రకాల లోహాలను కూడా నగల డిజైన్లలో ఉపయోగిస్తారు. కాబట్టి మీరు గోల్డ్‌ కొనేటప్పుడు వాటి బరువు కూడా బంగారంలో యాడ్ అవుతుంది. కానీ మీరు దానిని అమ్మడానికి వెళ్ళినప్పుడు, మీకు కేవలం బంగారం ధర మాత్రమే అభిస్తుంది. అలా కాకుండా మీరు బంగారు నాణేలు లేదా బిస్కెట్లు కొంటే.. రత్నాలు, ఇతర విలువైన రాళ్ల కోసం మీరు అదనపు ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదు.

3 / 5
బంగారం కొనేటప్పుడు, దాని స్వచ్ఛత కోసం క్యారెట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 14 నుండి 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. కానీ స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు. ఆభరణాలను అమ్మేటప్పుడు, మీకు క్యారెట్ ప్రకారం ధర ఇవ్వబడుతుంది. కానీ బంగారు నాణేలతో ఇది జరగదు.

4 / 5
 చిన్న వ్యాపారులు లేదా ఆభరణాల వ్యాపారులు తరచుగా క్యారెట్లను మోసం చేస్తారు. వారు 18 లేదా 14 క్యారెట్ బంగారాన్ని 22 క్యారెట్లుగా అమ్ముతారు. కానీ బంగారు బిస్కెట్లలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే బంగారు బిస్కెట్లు 24 క్యారెట్లతో తయారు చేయబడతాయి. అంతేకాకుండా దానిపై హాల్‌మార్క్ గుర్తు కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపారులు మిమ్మల్ని మోసం చేయలేరు.

5 / 5