Get rid of rats: ఇంట్లో ఎలకల బెడదా ఎక్కువైందా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమి కొట్టేయండి..
ఇంట్లో ఒక్క ఎలుక ఉన్నా చాలు.. ఇంటి మొత్తాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఇంట్లో కరెంట్ వైర్ల దగ్గర్నుంచి.. బట్టలను, బుక్స్‌ని మొత్తం కొరికి పారేస్తాయి. కిచెన్‌లోని సామాగ్రిని సైతం చిందర వందర చేస్తుంది. వీటిని పట్టుకోవాలంటే ఒక పట్టాన త్వరగా దొరకవు. కానీ ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం.. ఎలుకలను ఈజీగా ఇంట్లో తరిమికొట్టవచ్చు. వేపాకులను ఉపయోగించి.. ఎలుకలను ఈజీగా తరిమికొట్టవచ్చు. వేపాకు ఉపయోగించడం వల్ల ఎలుకలు మళ్లీ ఇంట్లోకి రావు..
Updated on: Apr 21, 2024 | 10:44 AM

ఇంట్లో ఒక్క ఎలుక ఉన్నా చాలు.. ఇంటి మొత్తాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఇంట్లో కరెంట్ వైర్ల దగ్గర్నుంచి.. బట్టలను, బుక్స్‌ని మొత్తం కొరికి పారేస్తాయి. కిచెన్‌లోని సామాగ్రిని సైతం చిందర వందర చేస్తుంది. వీటిని పట్టుకోవాలంటే ఒక పట్టాన త్వరగా దొరకవు.

కానీ ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం.. ఎలుకలను ఈజీగా ఇంట్లో తరిమికొట్టవచ్చు. వేపాకులను ఉపయోగించి.. ఎలుకలను ఈజీగా తరిమికొట్టవచ్చు. వేపాకు ఉపయోగించడం వల్ల ఎలుకలు మళ్లీ ఇంట్లోకి రావు.. శాశ్వతంగా పారి పోతాయి.

వేపాకులను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోండి. దీన్ని ఒక పాత్రలో తీసుకోండి. వీటిని చికెన్ లేదా బజ్జీలు, రోటీలు వంటి వాటిపై పూతలా పూసి ఇంటి మూలల్లో ఉంచండి. వేపాకు పేస్టును ఉండల్లా చేసి కూడా మూలల్లో ఉంచండి. వీటిని ఒక్కసారి ఎలుకలు రుచి చూశాయంటే.. మళ్లీ అటువైపు రావు.

అదే విధంగా వెల్లుల్లి పాయలు కూడా ఎలుకల్ని తరిమేందుకు చక్కగా ఉపయోగ పడతాయి. దీని ఘాటు వాసన కారణంగా ఎలుకలు ఇంట్లో నుంచి పారి పోతాయి. ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో వెల్లుల్లి పాయల్ని దంచి.. ఆహార పదార్థాలతో కలిపి ఉంచండి. ఆ వాసనకు అవి వెళ్లిపోతాయి.

అలాగే సబ్బు కూడా చక్కగా పని చేస్తుంది. బట్టల సబ్బు లేదా స్నానం చేసే సబ్బుతో కూడా ఎలుకల్ని బయటకు తరిమి కొట్టవచ్చు. అన్నంలో సబ్బు బిల్లను ముక్కలుగా చేసి కలిపి.. ఎలుకలు తిరిగే చోట ఉంచండి. ఇతర ఆహార పదార్థాలతో కూడా సబ్బును కలపవచ్చు. ఇది తింటే ఎలుకలు ఇంటి నుంచి పారిపోతాయి.





























