Tips for Dark spots: మంగు మచ్చలతో బయటకు వెళ్లేందుకు ఇబ్బందా.. ఇలా చేస్తే మళ్లీ రావు!
చర్మ సమస్యలు అనేక రాకాలుగా ఉంటాయి. వాటిల్లో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. పిగ్మేంటషన్‌లో మంగు మచ్చలు కూడా ఒకటి. ఈ మంగు మచ్చల వల్ల ముఖం అంద విహీనంగా ఉంటుంది. దీంతో నలుగురిలోకి వెళ్లేందుకు చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. ఈ మంగు మచ్చలు రావడానికి చాలా కారణలాు ఉంటాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, మెలనిన్ ఎక్కువగా ఉత్పిత్తి అవ్వడం వల్ల ఆ భాగంలోని చర్మం నల్లగా మారుతుంది. దీంతో మంగు మచ్చలు వస్తాయి. స్త్రీలల్లో అయితే ఈస్ట్రోజన్ తగ్గి..
Updated on: Apr 21, 2024 | 11:44 AM

చర్మ సమస్యలు అనేక రాకాలుగా ఉంటాయి. వాటిల్లో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. పిగ్మేంటషన్‌లో మంగు మచ్చలు కూడా ఒకటి. ఈ మంగు మచ్చల వల్ల ముఖం అంద విహీనంగా ఉంటుంది. దీంతో నలుగురిలోకి వెళ్లేందుకు చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. ఈ మంగు మచ్చలు రావడానికి చాలా కారణలాు ఉంటాయి.

ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, మెలనిన్ ఎక్కువగా ఉత్పిత్తి అవ్వడం వల్ల ఆ భాగంలోని చర్మం నల్లగా మారుతుంది. దీంతో మంగు మచ్చలు వస్తాయి. స్త్రీలల్లో అయితే ఈస్ట్రోజన్ తగ్గి.. ప్రాజెస్టిరాన్ అనే హార్మోన్ పెరగడం వల్ల కూడా ఈ మంగు మచ్చలు అనేవి వస్తాయి.

ఈ సమస్య రాకుండా ఉండాలంటే.. ముందు ఎండలో తిరగడం మానేయాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే.. టోపి ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం, గొడుగు వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సన్ స్క్రీన్ రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే సోయా బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. సోయా బీన్స్ మొక్కల్లో ఫైటో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే.. శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగి.. మంగు మచ్చలు అనేవి తగ్గుతాయి.

మంగు మచ్చలను తగ్గించుకోవడంలో తేనె చక్కగా పని చేస్తుంది. మంగు మచ్చలపై తేనె రాస్తూ మర్దనా చేస్తూ ఉండాలి. దీంతో ఆ భాగంలో ఇన్ ఫ్లామేషన్ తగ్గుతుంది. అలాగే నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి వెంటనే తగ్గవు. క్రమంగా తగ్గుతూ ఉంటాయి.





























