- Telugu News Photo Gallery Gas problem can be reduced with home remedies, Check Here is Details in Telugu
Tips for Gas Problem: గ్యాస్ సమస్యా.. ఇంట్లోనే ఈ చిట్కాలతో తగ్గించుకోండి..
ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైన సమయానికి తినకపోవడం, జంగ్ ఫుడ్స్ తినడం వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ గ్యాస్ కారణంగా గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించడంలో ఈ హోమ్ రెమిడీస్ ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గ్యాస్ సమస్యను తగ్గించడంలో మజ్జిగ ఎంతో చక్కగా పని చేస్తుంది. గ్యాస్ ట్రబుల్‌ను దూరం చేసి రిలీఫ్‌ని ఇస్తుంది. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. పల్చగా మజ్జిగ..
Updated on: Aug 21, 2024 | 7:06 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైన సమయానికి తినకపోవడం, జంగ్ ఫుడ్స్ తినడం వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ గ్యాస్ కారణంగా గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించడంలో ఈ హోమ్ రెమిడీస్ ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గ్యాస్ సమస్యను తగ్గించడంలో మజ్జిగ ఎంతో చక్కగా పని చేస్తుంది. గ్యాస్ ట్రబుల్‌ను దూరం చేసి రిలీఫ్‌ని ఇస్తుంది. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. పల్చగా మజ్జిగ చేసుకుని తాగాలి. గ్యాట్ ట్రబుల్‌ని తగ్గించడంలో మెంతి నీరు కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.

పుదీనాతో ఎన్నో జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మీకు గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు పుదీనా నీటిని లేదా టీ తాగినా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. పుదీనా గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని త్వరగా తగ్గించి రిలీఫ్‌ని ఇస్తుంది.

గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట వంటి సమస్యలను తగ్గించడంలో వాము ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ కంటే వాము వాటర్ తాగినా.. వాము ఆకులు నమిలినా మంచి ఫలిత ఉంటుంది.

అల్లంతో కూడా గ్యాస్ ట్రబుల్‌ని తగ్గించుకోవచ్చు. గ్యాస్ వచ్చినప్పుడు పాలు లేకుండా అల్లం టీని తాగండి. అదే విధంగా జీలకర్ర టీ, లెమన్ వాటర్‌తో కూడా ఎంతో చక్కగా గ్యాస్ తగ్గించుకోవచ్చు. ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.




