Kiara Advani: నిన్న మొన్నటిదాకా ట్రేండింగ్ లో కియారా అద్వానీ పేరు.! మరి ఇప్పుడు.?
ఇప్పుడు కాస్త తగ్గింది కానీ, మొన్న మొన్నటిదాకా సౌత్‌లో ఏ టాప్ హీరో సినిమా మొదలవుతుందనుకున్నా, వెంటనే హీరోయిన్ల పేర్లలో కియారా అద్వానీ పేరు బ్లింక్ అయ్యేది. మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వైరల్ అవుతూనే ఉండేది ఆమె పేరు.. ఇప్పుడు లేటెస్ట్ గా కియారా గురించి ఏం వార్తలు నడుస్తున్నాయ్ అంటారా.? కియారా అద్వానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అనగానే.. జరగండి జరగండి అంటూ రామ్‌చరణ్‌తో ఆమె ఆడిపాడిన గేమ్ చేంజర్ పాట మాత్రమే గుర్తుకొస్తుంది.