సద్గురు ‘సేవ్ సాయిల్’ ఆదర్శంతో రైతుల ముందడుగు.. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు..

సద్గురు జన్మదినోత్సవం సందర్భంగా.. నేలను రక్షించడానికి ఆయన ప్రారంభించిన (సేవ్ సాయిల్) ప్రపంచ ఉద్యమం స్ఫూర్తితో.. రైతులంతా ఒక్కటై ముందడుగు వేశారు.. బనస్కాంతలో బనాస్ సేవ్ సాయిల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ (BSSFPC)ని మంగళవారం స్థాపించారు.

|

Updated on: Sep 03, 2024 | 9:11 PM

సద్గురు జన్మదినోత్సవం సందర్భంగా.. నేలను రక్షించడానికి ఆయన ప్రారంభించిన (సేవ్ సాయిల్) ప్రపంచ ఉద్యమం స్ఫూర్తితో.. రైతులంతా ఒక్కటై ముందడుగు వేశారు.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని రైతులు సద్గురు బర్త్ డే సందర్భంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బనస్కాంతలో బనాస్ సేవ్ సాయిల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ (BSSFPC)ని స్థాపించారు. భారతదేశంలోనే మొట్టమొదటి మట్టి-కేంద్రీకృత రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (FPC), సేవ్ సాయిల్ ఉద్యమ భాగస్వామ్యంతో దీనిని ప్రారంభించారు. FPCలో కొత్త అధునాతన మట్టి పరీక్షా ప్రయోగశాల, బయోఫెర్టిలైజర్ ల్యాబ్ ఉన్నాయి. గుజరాత్ విధానసభ స్పీకర్, బనాస్ డెయిరీ ఛైర్మన్ శంకర్‌భాయ్ చౌదరి తరద్‌లోని బనాస్ సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీ (BSTL), ఖిమానాలోని బనాస్ బయో ఫర్టిలైజర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ (BBRDL), రైతు శిక్షణా హాల్‌తో పాటు FPCని ప్రారంభించారు.

1 / 5
ఈ సందర్భంగా ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో గ్లోబల్ సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బనస్కాంత రైతులను అభినందించారు.. ఇది విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రజలకు పోషణను అందించడమే కాకుండా మన జీవితానికి మూలమైన నేలను పోషించి, సుసంపన్నం చేస్తుందని ఆయన అన్నారు. “గుజరాత్ & భారత్ అభివృద్ధికి గణనీయమైన సహకారం అందించిన సేవ్ సాయిల్ బనాస్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్‌కు మార్గదర్శకత్వం వహించినందుకు బనాస్ డెయిరీలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు.. ఆశీర్వాదాలు.. FPO ప్రజలకు పోషణను అందించడమే కాకుండా మన జీవితానికి మూలాధారమైన వ్యవసాయాన్ని సుసంపన్నం చేస్తుంది. FPOలు ఖచ్చితంగా గ్రామీణ శ్రేయస్సు & భారత్ శ్రేయస్సు భవిష్యత్తు.. ఎందుకంటే అవి మన జనాభాలో 65% మందికి ఆర్థిక అవకాశాలను మెరుగుపరుస్తాయి.’’ అని సద్గురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2 / 5
FPC ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుజరాత్ అసెంబ్లీ స్పీకర్, బనాస్ డెయిరీ ఛైర్మన్ శంకర్‌భాయ్ చౌదరి మాట్లాడుతూ బనాస్ సేవ్ సాయిల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఇది స్థిరమైన భవిష్యత్తుకు పునాది వేస్తుందని తెలిపారు. ఇది నేల-క్షీణించిన ప్రాంతాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ప్రవీణ శ్రీధర్ అన్నారు. ఎఫ్‌పిసి ఏర్పాటుకు సన్నాహకంగా, థారాడ్, లఖానీ తాలూకాలలోని 40 గ్రామాల నుండి 14,492 మంది రైతులతో సేవ్ సాయిల్ బనాస్ బృందం ఒక్కటైంది.. అత్యాధునిక భూసార పరీక్షా ప్రయోగశాల.. జీవసంబంధ పరీక్షలను, సూక్ష్మజీవుల జీవితం, నేల ఆరోగ్యాన్ని హైలైట్ చేసే "సాయిల్ లైఫ్ రిపోర్ట్"ను అందిస్తోంది.

3 / 5
14 నెలలుగా సేవ్ సాయిల్ బృందం రైతులను FPCలో నమోదు చేయడానికి బనాస్ డెయిరీ బృందం భాగస్వామ్యంతో వర్క్‌షాప్‌లను నిర్వహించింది. తరద్, లఖానీలోని ప్రాంతాలు రైతులకు పేలవమైన నేల నాణ్యత, క్షీణిస్తున్న భూగర్భజలాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో సహా అనేక సవాళ్లను కలిగి ఉన్నాయి. రసాయన ఆధారిత ఎరువులను అధికంగా వాడటం వలన భూమి క్షీణతకు ప్రమాదకర స్థాయిలో దారితీసింది. నేల ఆరోగ్యంపై ఖచ్చితమైన అంచనా లేకుండా, రైతులు నేల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను వర్తింపజేయడంలో విఫలమైనప్పుడు అనవసరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ లోటును పరిష్కరించడానికి ఎఫ్‌పిసిలో భాగంగా అత్యాధునిక భూసార పరీక్ష ల్యాబొరేటరీని ప్రారంభించారు.

4 / 5
బనాస్ బయోఫెర్టిలైజర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ స్థిరమైన ఎరువులలో ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తుంది. ల్యాబ్‌ను సందర్శించిన రైతులు సాంప్రదాయ రసాయన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలమైన బయో ఎరువులను అభివృద్ధి చేయడాన్ని ప్రత్యక్షంగా చూశారు. వ్యవసాయ ఉత్పాదకతలో రాజీ పడకుండా జీవ-ఎరువు నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది. ఖిమనాలో పరిశోధన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల కొత్తగా ఏర్పడిన FPC అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక బయో-ఎరువుల సాంకేతికతను కలిగి ఉంటుంది.

5 / 5
Follow us