బ్రోకలీలో గ్లూకోసినోలేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర నిర్విషీకరణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సమ్మేళనం కాలేయం నిర్విషీకరణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఇది టాక్సిన్స్, హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే బ్రోకలీలో కాల్షియం, విటమిన్ కె, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్ధాలన్నీ మొత్తం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతాయి. కాల్షియం అనేది ఎముక కణజాలం ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్. అయితే ఇందులోని విటమిన్ K కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం ఎముక సాంద్రతను పెంచుతుంది.