- Telugu News Photo Gallery Follow these tips for pregnant ladies to sleep well, Check here is details in Telugu
Pregnant Sleeping Tips: ప్రెగ్నెంట్ లేడీస్ చక్కగా పడుకోవాలంటే.. ఈ టిప్స్ బెస్ట్!
గర్భాధారణ సమయంలో మహిళలు ఎక్కువగా సమస్యల్లే నిద్ర లేమి కూడా ఒకటి. ప్రెగ్నెంట్ లేడీస్ నిద్రపోయేందుకు చాలా కష్ట పడుతూ ఉంటారు. పొట్ట పెద్దగా అవుతున్న కొద్దీ వీరికి పడుకునేందుకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే హార్మోనల్ చేంజస్ వల్ల నిద్ర సరిగా పట్టదు. అంతే కాకుండా మూడ్ స్వింగ్స్, పగటి పూట నిద్ర, కండరాల తిమ్మిరి, మూత్ర విసర్జన వంటి కారణాల వల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. దీంతో ఉదయానికి చాలా నీరసంగా, అలసటగా..
Updated on: Apr 06, 2024 | 4:58 PM

గర్భాధారణ సమయంలో మహిళలు ఎక్కువగా సమస్యల్లే నిద్ర లేమి కూడా ఒకటి. ప్రెగ్నెంట్ లేడీస్ నిద్రపోయేందుకు చాలా కష్ట పడుతూ ఉంటారు. పొట్ట పెద్దగా అవుతున్న కొద్దీ వీరికి పడుకునేందుకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే హార్మోనల్ చేంజస్ వల్ల నిద్ర సరిగా పట్టదు.

అంతే కాకుండా మూడ్ స్వింగ్స్, పగటి పూట నిద్ర, కండరాల తిమ్మిరి, మూత్ర విసర్జన వంటి కారణాల వల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. దీంతో ఉదయానికి చాలా నీరసంగా, అలసటగా ఉంటారు. గర్భిణీలకు నిద్ర అనేది చాలా అవసరం.

నిద్ర సరిగ్గా పట్టకపోతే కనుక.. మెత్తగా ఉండే రెండు, మూడు దిండ్లు తీసుకోండి. వీటిని వెనుక వీపుకు, ముందు పొట్ట దగ్గర, కాలు కింద పెట్టుకుని పడుకోండి. ఇలా చేస్తే నిద్ర చక్కగా పడుతుంది. వీలైనంత వరకు జంక్ ఫుడ్‌కి దూరగా ఉండండి.

రాత్రి పడుకునే ముందు ఓ గ్లాస్ గోరు వెచ్చటి పాలను తాగితే నిద్ర చక్కగా పడుతుంది. అలాగే బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకున్నా నిద్ర పడుతుంది. ముఖ్యంగా ఫోన్‌కు చాలా దూరంగా ఉండాలి.

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. అలాగే తిమ్మిర్లు, కండరాల నొప్పులు, వాపులు వంటివి తగ్గుతాయి. ప్రతి రోజూ మీరు ఒకే సమయానికి పడుకునే విధంగా అలవాటు చేసుకోండి.




