Guava Leaves: జామ ఆకులతో సంతాన సమస్యలు మాయం..
మనకు ఈజీగా లభించే వాటిల్లో జామ ఆకులు కూడా ఒకటి. జామ చెట్టు ఎక్కడైనా సులువుగా పెరుగుతుంది. జామ చెట్టు, బెరడు, కాండం, ఆకులు, కాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటితో ప్రమాదకరమైన సమస్యలను కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..
Updated on: Jan 22, 2025 | 9:54 PM

జామ ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జామ కాయలు ఎంత ఆరోగ్యకరమో.. జామ ఆకులు కూడా అంతే హెల్దీ. జామ చెట్టు కాండం, బెరడులో కూడా మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. జామ ఆకులు ప్రతి రోజూ నమిలి తినడం వల్ల పలు రకాల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

ప్రస్తుత కాలంలో అనేక మార్పుల కారణంగా చాలా మంది సంతాన లేమి సమస్యలతో బాధ పడుతున్నారు. వయసు మీద పడుతున్నా పిల్లలు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంతాన సమస్యలను తగ్గించడంలో జామ ఆకులు ఎంతో చక్కగా పని చేస్తాయి.

అదనంగా, సూర్యుని అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే సమస్యల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో, పీరియడ్స్ నొప్పి తీవ్రతను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

జామ ఆకుల జ్యూస్‌లో తేనె కలిపి తాగవచ్చు. ఇది తాగలేని వారు జామ ఆకులు నమిలి తిన్నా కూడా సంతాన సమస్యలు సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. జామ ఆకులు నమిలి తిన్నా వీర్య కణాల ఉత్పత్తి బాగా పెరుగుతుందట.

జామ ఆకుల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటితో పలు రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చని ఇప్పటికే చాలా సార్లు తెలుసుకున్నాం. జామ ఆకులతో చేసిన టీ తాగితే.. శ్వాస సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




