నేనింతే.. నాకు నచ్చినట్టే ఉంటానంటున్న సీతారామమ్ బ్యూటీ? ఎందుకంటే?
అన్ని సమయాలూ ఒకలా ఉండవు. ఒకేలా అస్సలుండవు. అందుకే అన్నీ అనుకూలంగా ఉన్నాయనిపించినప్పుడు బెట్టు చేయకూడదు. కాస్త చూసీ చూడనట్టు వెళ్తూ, కావాల్సింది అందిపుచ్చుకోవాలి... ఇంతకీ ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా? నేను చెప్పడం కాదండోయ్.. మృణాల్ ఠాకూర్‌కి ఆమె వెల్‌విషర్స్ చెబుతున్నారట. ఇంతకీ మన సిల్వర్‌స్క్రీన్ సీత ఏమంటున్నారో...
Updated on: Jan 23, 2025 | 7:32 AM

నేనింతే.. నాకు నచ్చినట్టే ఉంటా. నాకు నచ్చిన విషయాలను బరాబర్ చేస్తానని చెప్పే వాళ్లల్లో ముందు ప్లేస్‌లోనే ఉంటారు మృణాల్ ఠాకూర్. ఆమె అడుగు ముందుకు వేయాలంటే అక్కడ ఆమెకు నచ్చిన విషయం ఏదో ఒకటి ఉండి తీరాల్సిందే. సీతారామమ్ సినిమాలో సీతకున్నన్ని పట్టు విడుపులు రియల్ లైఫ్లో మృణాల్‌కి లేవన్నదే నిజం అంటారు ఆమె గురించి బాగా తెలిసిన వారు.

సీతారామమ్ తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి మృణాల్‌కి. అయినా ఆమె ఆచీ తూచీ అడుగులు వేశారు. హాయ్ నాన్న సినిమాతో సక్సెస్ అందుకున్నప్పుడు మరింత బాధ్యత వచ్చినట్టు ఫీలయ్యారు. స్క్రిప్ట్ విషయాల్లో పర్టిక్యులర్‌గా ఉండాలని ఫిక్సయ్యారు.

నన్ను చూడ్డానికి జనాలు థియేటర్లకు వస్తున్నప్పుడు, నేనింకెంత బాధ్యతతో ఉండాలి.. అన్నీ స్క్రిప్టులు సెలక్ట్ చేసుకుంటే, నా స్పెషాలిటీ ఏముంటుంది? నాకోసమే, నన్ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ కథలు రాస్తున్నప్పుడు, అందులో నాకు సూట్ అయ్యేవాటిని సెలక్ట్ చేసుకుంటేనే కదా.. అసలైన కిక్కు అంటున్నారు మృణాల్.

తనవైన లెక్కలతో తెలుగుకు కాస్త దూరంగానే ఉంటున్న మృణాల్ లేటెస్ట్ గా బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గణ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్‌లో అజయ్‌తో కలిసి ఆడిపాడనున్నారు మృణాల్ ఠాకూర్.

ఈ సినిమాను ఈ ఏడాది జులై 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్లాన్. మన మర్యాదరామన్న రీమేక్‌కి వస్తున్న సీక్వెల్ కాబట్టి, తెలుగు ప్రేక్షకుల్లోనూ తప్పకుండా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది ఈ మూవీ. ఆ తర్వాతైనా మృణాల్ వరుసగా తెలుగు చిత్రాలు చేస్తారా? లేదా చూడాల్సి ఉంది.





























