Eye Care Tips in Summer: వేసవిలో పొంచి ఉన్న కళ్ల సమస్యలు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నయనానందమే!
వేసవిలో వేడిగాలుల ప్రభావం వల్ల డీహైడ్రేషన్‌తో పాటు కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తీవ్రమైన ఎండ, వడ గాలులు కంటికి హాని కలిగిస్తాయి. అందువల్లనే వేసవిలో కంటి సమస్యలు పెరుగుతాయి. శరీర డీహైడ్రేషన్‌తో పాటు పొడి కళ్ల సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్యల నివారణకు వేసవిలో అధికంగా నీరు తాగడంతోపాటు కళ్లపై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం..