- Telugu News Photo Gallery Eating these fruits will keep the liver healthy, check here is details in Telugu
Liver Health: ఈ పండ్లు తింటే.. పాడైపోయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. కాలేయం ఎన్నో రకాల పనులను చేస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపి.. రక్షణగా నిలుస్తుంది. అయితే మీకు తెలియకుండానే చెడు ఆహారాలు తిని లివర్ ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. లివర్ ఫెయిల్ అయి చాలా మంది చనిపోతున్నారు. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ డైట్‌లో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాల్సిందే. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు బ్లూ అండ్ బ్లాక్ బెర్రీలు చక్కగా సహాయ పడతాయి. ఇవి కడుపులోకి వెళ్లి సూపర్ ఆక్సిడైజ్..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Mar 30, 2024 | 2:04 PM

శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. కాలేయం ఎన్నో రకాల పనులను చేస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపి.. రక్షణగా నిలుస్తుంది. అయితే మీకు తెలియకుండానే చెడు ఆహారాలు తిని లివర్ ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. లివర్ ఫెయిల్ అయి చాలా మంది చనిపోతున్నారు. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ డైట్‌లో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాల్సిందే.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు బ్లూ అండ్ బ్లాక్ బెర్రీలు చక్కగా సహాయ పడతాయి. ఇవి కడుపులోకి వెళ్లి సూపర్ ఆక్సిడైజ్ ఫార్ములేషన్ స్పీడుగా జరిగేలా చేస్తుంది. దీని వల్ల టాక్సిఫికేషన్ కూడా స్పీడ్ జరుగుతుంది. కణాలు దెబ్బతినకుండా చేస్తాయి.

మనకు అందుబాటులో తక్కువ ధరలో లభ్యమయ్యేవి జామ పండ్లు. వీటిల్లో విటమిన్ సి అనేది అత్యధికంగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల లివర్ పాడవకుండా ఉంటుంది. లివర్ డిటాక్సిఫికేషన్‌కి.. విటమిన్ సి ఎంతో అవసరం.

లివర్ కాపాడటంలో ద్రాక్ష పండ్లు కూడా చక్కగా పని చేస్తాయి. వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తింటే ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే కణాలు దెబ్బతినకుండా చేస్తుంది.

అవకాడో కూడా లివర్ ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఇందులో గ్లూటాథియోన్.. లివర్ డిటాక్సిఫికేషన్‌కు ఉపయోగ పడుతుంది. విష పదార్థాలను బయటకు పంపించడంలో అవకాడో బాగా సహయ పడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో ఉన్నవారు అవకాడో తింటే ఎంతో మంచిది.





























