- Telugu News Photo Gallery Dry fruits health benefits: How To Eat Dry Fruits For Maximum Health Benefits
Dry Fruits Benefits: ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లలో నానబెట్టిన ఎండు ఖర్జూరం తిన్నారంటే..
మన శరీరంలోని సమస్యలన్నీ పోషకాహార లోపం వల్ల ఏర్పడతాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్లనే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆహారం అజీర్ణం, ఊబకాయం, నిద్రలేమితో పాటు గ్యాస్-గుండె మంట వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. నేటి కాలంలో గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు సర్వ సాధారణం అయ్యాయి. ఈ సమస్యలన్నింటిని ఇంటి నుంచే నివారణ పొందవచ్చు. ముందుగా యాంటాసిడ్‌లను తీసుకోవడం మానుకోవాలి. అసిడిటీని సులభంగా వదిలించుకోవడానికి ప్రతిరోజూ ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి..
Updated on: Feb 13, 2024 | 8:14 PM

మన శరీరంలోని సమస్యలన్నీ పోషకాహార లోపం వల్ల ఏర్పడతాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్లనే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆహారం అజీర్ణం, ఊబకాయం, నిద్రలేమితో పాటు గ్యాస్-గుండె మంట వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

నేటి కాలంలో గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు సర్వ సాధారణం అయ్యాయి. ఈ సమస్యలన్నింటిని ఇంటి నుంచే నివారణ పొందవచ్చు. ముందుగా యాంటాసిడ్‌లను తీసుకోవడం మానుకోవాలి. అసిడిటీని సులభంగా వదిలించుకోవడానికి ప్రతిరోజూ ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి.

అలాగే మామిడి, నిమ్మ, జామ వంటి పండ్లను క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నే కొన్ని జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, కనీసం 4-5 ఖర్జూరాలు తప్పక తినాలి.

ప్రతి రాత్రి రెండు ఖర్జూరాలను నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ ఖర్జూరాలు తినాలి. ఇది శరీరంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అలాగే పొట్ట కూడా శుభ్రంగా ఉంటుంది. గ్యాస్-అసిడిటీ వంటి కడుపు సమస్యలే కాదు, ఈ డ్రై ఫ్రూట్ బహుళ శారీరక విధుల్లో చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది.

ఖర్జూరం, వాల్‌నట్స్, బాదం, ఎండుద్రాక్షలో మన శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తుంది. రోజంతా పనిచేసినా అలసట ఉండదు. రోజూ 2-3 ఖర్జూరాలు తినాలి. అలాగే నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షను తిన్నా ఎసిడిటీ సమస్య తొలగిపోతుంది. కడుపు చల్లగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యతతో బాధపడేవారికి ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు దివ్యౌషధంలా పనిచేస్తుంది. పీరియడ్స్ సమస్యలు దూరమవుతాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్షలను తినాలి. అలాగే నానబెట్టిన బాదం, వాల్‌నట్స్, ఖర్జూరం తింటే శరీరంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.




