- Telugu News Photo Gallery Drive away negative energy in the house with incense sticks, check here is details in Telugu
Spiritual Tips: అగరుబత్తీలతో ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని వెళ్లగొట్టండి..
సాధారణంగా ఇంట్లో ఎవరికి ఇష్టమైన వారాల్లో వాళ్లు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. ఎక్కువగా శుక్ర, శని వారాల్లో పూజ చేస్తారు. పూజ చేసే సమయంలో దేవుడికి పువ్వులు, కర్పూరం, అగరుబత్తీలు, నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. అయితే దేవుడుకి సమర్పించే వాటిల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అదే క్రమంలో అగరబత్తీలతో ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి.. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికి..
Updated on: Feb 16, 2024 | 3:57 PM

సాధారణంగా ఇంట్లో ఎవరికి ఇష్టమైన వారాల్లో వాళ్లు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. ఎక్కువగా శుక్ర, శని వారాల్లో పూజ చేస్తారు. పూజ చేసే సమయంలో దేవుడికి పువ్వులు, కర్పూరం, అగరుబత్తీలు, నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. అయితే దేవుడుకి సమర్పించే వాటిల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

అదే క్రమంలో అగరబత్తీలతో ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి.. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికి. ప్రతి రోజూ నిత్యం ఇంట్లో అగరబత్తీల ధూపం వేయడం వల్ల ఇంట్లో సానుకూలత వాతావరణం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

రోజూ అగరబత్తీలను వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అగరబత్తీలు ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా చెబుతారు. అదే విధంగా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో అగబత్తీలు వెలిగించడం వల్ల సానుకూలత శక్తి నెలకొంటుంది. దీంతో ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.

అదే విధంగా ప్రతి రోజూ ధూపం వేయడం వల్ల వాస్తు దోషాలు తొలగి.. ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని జోత్యిష్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ధూపం వేయడం వల్ల సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి నశిస్తాయి.




