- Telugu News Photo Gallery Drinks for Fatty Liver Detox: Easy Ways To Detox Liver With Spices And Herbs Mixed Drinks
Detox Water for Fatty Liver: ఫ్యాటీ లివర్‌ను సహజసిద్ధంగా శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్స్ ఇవే.. రోజూ ఇలా తాగితే మేలే
నేటి తరం యువతలో ఫ్యాటీ లివర్ సర్వసాధారణమై పోయింది. బయటి తిండికి అలవాటు పడడి.. వేపుడు పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా ఫ్యాటీ లివర్ బారీన పడుతున్నారు. కాలేయంలో సమస్య ఉంటే మొత్తం ఆరోగ్యం బలహీనపడుతుంది. అంతేకాదు కాలేయంలో ఒక్కసారి కొవ్వు పేరుకుపోతే లివర్ ఫెయిల్యూర్, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇది మరణానికి కూడా దారితీస్తుంది. అవకాశాన్ని కూడా పెంచుతుంది..
Updated on: Mar 22, 2024 | 12:55 PM

నేటి తరం యువతలో ఫ్యాటీ లివర్ సర్వసాధారణమై పోయింది. బయటి తిండికి అలవాటు పడడి.. వేపుడు పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా ఫ్యాటీ లివర్ బారీన పడుతున్నారు. కాలేయంలో సమస్య ఉంటే మొత్తం ఆరోగ్యం బలహీనపడుతుంది. అంతేకాదు కాలేయంలో ఒక్కసారి కొవ్వు పేరుకుపోతే లివర్ ఫెయిల్యూర్, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇది మరణానికి కూడా దారితీస్తుంది. అవకాశాన్ని కూడా పెంచుతుంది.

కొవ్వు కాలేయ ప్రమాదాన్ని నివారించడానికి నిర్విషీకరణ అవసరం. ఈ కింది కొన్ని రకాల స్పెషల్ డ్రింక్స్ సహాయంతో కొవ్వు కాలేయ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించే 6 రకాల పానీయాలు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. అల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అల్లం రసం లేదా అల్లం టీ తాగడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడొచ్చు. అల్లం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా అల్లం, పాలకూర, అరటిపండు, క్యాన్ వాటర్‌తో స్మూతీ తయారు చేసుకుని తాగడం వల్ల కాలేయం డిటాక్సిఫై అవుతుంది.

స్మూతీస్ చేయడానికి సమయం లేకపోతే, గ్రీన్ టీ తాగవచ్చు. తులసి ఆకులు, అల్లం తో గ్రీన్ టీ తాగవచ్చు. ఈ టీ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపి.. కాలేయం శరీరం నిర్విషీకరణలో సహాయపడుతుంది.

అలాగే వేడి పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి, ఒక చెంచా తేనె కలిపి తాగినా మేలే. ఇది కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి. ఈ వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని కూడా తాగొచ్చు. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కాలేయంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను కూడా బయటకు పంపుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ ఎవరూ ఇష్టపడరు. కానీ ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో, బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. గ్లాసుడు నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగాలి. ఫలితంగా గొప్ప ప్రయోజనాలను పొందుతారు.




