- Telugu News Photo Gallery 61percent Citizens Got Less than 6 Hours of Uninterrupted Sleep in Past 12 Months, Finds Local Circles Survey
Sleep: తెలుసా..? 61 శాతం భారతీయులు నిద్రలేమితో బాధపడుతున్నారట! కారణం ఏమిటంటే
ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం. కంటికి తగినంత నిద్ర లేకపోతే, రోజంతా పని చేయడానికి తగినంత శక్తి ఉండదు. కానీ చాలా మంది రాత్రిళ్లు పరిపడా నిద్రపోవడంలేదని మీకు తెలుసా? అవును, తాజా పరిశోధనల్లో ఈ విషయం తేలింది. 61 శాతం మంది భారతీయులు తగినంత నిద్రపోవడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రీసెర్చ్ పేపర్ 'హౌ ఇండియా స్లీప్స్' ప్రకారం.. భారతదేశంలోని 309 జిల్లాల్లోని 41,000 మందిపై గత 12 నెలలుగా ఈ అధ్యయనం చేశారు..
Updated on: Mar 22, 2024 | 12:36 PM

దీనితో పాటు జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి అలవాటు వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.

రీసెర్చ్ పేపర్ 'హౌ ఇండియా స్లీప్స్' ప్రకారం.. భారతదేశంలోని 309 జిల్లాల్లోని 41,000 మందిపై గత 12 నెలలుగా ఈ అధ్యయనం చేశారు. వీరిలో 66 శాతం మంది పురుషులు, 31 శాతం మంది మహిళలు ఉన్నారు. 61 శాతం మందికి నిద్ర సరిగా పట్టడం లేదని సర్వే వెల్లడించింది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెద్దలు ఆరోగ్యంగా ఉండాలంటే 8-9 గంటల నిద్ర అవసరం.

కానీ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మందికి తగినంత నిద్ర పోవడంలేదు. 61 శాతం మందిలో 23 శాతం మంది రాత్రి 4 గంటలు మాత్రమే నిద్రపోతారు. మిగిలిన 28 శాతం మంది సగటున 6 నుంచి 8 గంటలు నిద్రపోతారు. 5-6 శాతం మంది మాత్రమే రాత్రిళ్లు 8 నుండి 9 గంటల వరకు తగినంత నిద్ర పొందుతున్నారు.

61 శాతం మందికి రాత్రిళ్లు ఎందుకు సరిగ్గా నిద్రపోవడం లేదనే విషయంపై పరిశోధన చేయగా ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. తరచుగా బాత్రూమ్‌కు వెళ్లడం, ఫోన్‌ని తనిఖీ చేయడం వల్ల తగినంత నిద్ర పోవడం లేదు. ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లకు సమాధానం ఇవ్వడానికి చాలా మంది రాత్రిపూట మేల్కొంటున్నట్లు పరిశోధనలో పేర్కొన్నారు.

కొంతమంది పిల్లలు లేదా భాగస్వామి కారణంగా చాలా మంది నిద్రపోవడంలేదు. 2019లో అమెరికాలో నిద్రపై ఓ అధ్యయనం జరిగింది. సరైన నిద్ర లేని దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. మొదటిది జపాన్. కోవిడ్-19 ప్రజల నిద్ర అలవాట్లపై కొంత ప్రభావం చూపిందని అధ్యయనం తెలిపింది. తగినంత నిద్ర లేకపోవడం ప్రజలలో ఊబకాయం, మధుమేహం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది.




