Button Mushroom Benefits: బటన్ మష్రూమ్స్‌లో ఎన్ని ఆరోగ్య రహస్యాలో.. డోంట్ మిస్!
మష్రూమ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు చాలా మంది వీటిని తింటున్నారు. నాన్‌వెజ్‌లో ఉండే పోషకాలన్నీ మష్రూమ్స్‌లో లభిస్తాయి. మష్రూమ్స్ కూడా వెజిటేరియన్ ఆహారమే. కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్లు హ్యాపీగా మష్రూమ్స్‌ని తినొచ్చు. అయితే ఈ పుట్టగొడుగుల్లో బటన్ మష్రూమ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇవి చాలా చిన్నగా బటన్స్ సైజులో ఉంటాయి. ప్రస్తుతం ఇవి కూడా మార్కెట్లో..
Updated on: Mar 22, 2024 | 12:37 PM

అయితే ఈ పుట్టగొడుగుల్లో బటన్ మష్రూమ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇవి చాలా చిన్నగా బటన్స్ సైజులో ఉంటాయి. ప్రస్తుతం ఇవి కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిల్లో కూడా చాలా రకాల పోషకాలు ఉన్నాయి.

అయితే ఈ పుట్టగొడుగుల్లో బటన్ మష్రూమ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇవి చాలా చిన్నగా బటన్స్ సైజులో ఉంటాయి. ప్రస్తుతం ఇవి కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిల్లో కూడా చాలా రకాల పోషకాలు ఉన్నాయి.

బటన్ పుట్టగొడుగుల్లో ముఖ్యంగా సెలీనియం అనే మూలకం లభ్యమవుతుంది. ఇది తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీంతో అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

బటన్ మష్రూమ్స్ తినడం వల్ల.. కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అంతే కాకుండా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరుగుదల కాకుండా నిరోధిస్తాయి. వీటిని తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వొచ్చు.

బటన్ మష్రూమ్స్‌ని తరచూ తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అలాగే జీర్ణ క్రియకు కూడా చాలా మంచిది. మల బద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.




