- Telugu News Photo Gallery Drinking these drinks during rainy season will boost immunity, check here is details
Immunity Boost Drinks: ఇలాంటి సమయంలో ఈ డ్రింక్స్ తాగితే సూపర్ బెనిఫిట్స్..
నిన్న మొన్నటి దాకా ఎండలతో అల్లాడిన ప్రజలకు.. వర్షాలు కాస్త ఉపశమనం ఇచ్చాయి. ఇప్పుడు వాతావరణం కాస్త హాయిగా ఉంది. కానీ తెలిసిందే కదా.. చిన్న జల్లుల్లో తడిసినా.. సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తాయి. పిల్లలు, పెద్దలు అందరూ వరుసగా జబ్బుల బారిన పడతారు. ఇందుకు కారణం ఇమ్యూనిటీ తగ్గడమే. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీ పొంది.. హెల్దీగా ఉండాలంటే కొన్ని రకాల డ్రింకులు తాగడం మంచిది. వాటిల్లో మొదటిది.. దాల్చిన చెక్క వాటర్. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, తేనె కలుపుకుని..
Updated on: Jul 03, 2024 | 6:42 PM

నిన్న మొన్నటి దాకా ఎండలతో అల్లాడిన ప్రజలకు.. వర్షాలు కాస్త ఉపశమనం ఇచ్చాయి. ఇప్పుడు వాతావరణం కాస్త హాయిగా ఉంది. కానీ తెలిసిందే కదా.. చిన్న జల్లుల్లో తడిసినా.. సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తాయి. పిల్లలు, పెద్దలు అందరూ వరుసగా జబ్బుల బారిన పడతారు. ఇందుకు కారణం ఇమ్యూనిటీ తగ్గడమే.

ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీ పొంది.. హెల్దీగా ఉండాలంటే కొన్ని రకాల డ్రింకులు తాగడం మంచిది. వాటిల్లో మొదటిది.. దాల్చిన చెక్క వాటర్. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, తేనె కలుపుకుని తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వల్ల.. జబ్బులతో పోరాడే శక్తి లభిస్తుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి.. వ్యాధులతో పోరాడే వాటిల్లో జింజర్ - లెమన్ టీ కూడా ఒకటి. వానా కాలంలో.. ఈ టీని తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తాయి. ఇందులో యాంటీ బయెటిక్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

వర్షా కాలంలో మనం తాగాల్సిన వాటిల్లో తులసి టీ కూడా ఒకటి. తులసి టీ తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వేడిలో నీటిలో తులసి ఆకులు మరిగించి. అందులో కొద్దిగా తేనె కలిపి.. తరచూ తాగుతూ ఉంటే.. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

వర్షా కాలంలో తాగాల్సిన డ్రింక్స్‌లో పసుపు పాలు కూడా ఒకటి. పాలల్లో కొద్దిగా పసుపు వేసి మరిగించి.. ఆ పాలను తాగడం వల్ల కూడా శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థ బల పడి.. వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.




