- Telugu News Photo Gallery Do you want your lips to turn pink? follow these tips, check here is details in Telugu
Beauty Tips: పెదాలు గులాభి రంగులోకి మారాలా.. ఇలా చేయండి!
మనిషిలో అందర్నీ ముందు ఆకర్షించేది నవ్వు మాత్రమే. ఎవరైనా నవ్వితే తిరిగి వెంటనే నవ్వుతారు. మరి అలాంటి నవ్వు అందంగా ఉంటే.. మరింత బావుంటుంది. ఏంటా అనుకుంటున్నారా.. పెదాలు. చాలా మందికి పెదాలు అనేవి నల్లగా, పొడి బారిపోయి, అంద విహీనంగా ఉంటాయి. చాలా కొద్ది మందికి మాత్రమే పింక్ కలర్‌లో ఉంటాయి పెదాలు. చాలా మంది ముఖం, శరీరంపై శ్రద్ధ పెదాలపై చాలా తక్కువగా పెడతారు. అసలు పెదాలను పట్టించుకోరు. అయితే వీటిని కూడా మంచి హోమ్ రెమిడీస్‌తో అందంగా..
Updated on: Jan 19, 2024 | 10:39 PM

మనిషిలో అందర్నీ ముందు ఆకర్షించేది నవ్వు మాత్రమే. ఎవరైనా నవ్వితే తిరిగి వెంటనే నవ్వుతారు. మరి అలాంటి నవ్వు అందంగా ఉంటే.. మరింత బావుంటుంది. ఏంటా అనుకుంటున్నారా.. పెదాలు. చాలా మందికి పెదాలు అనేవి నల్లగా, పొడి బారిపోయి, అంద విహీనంగా ఉంటాయి.

చాలా కొద్ది మందికి మాత్రమే పింక్ కలర్‌లో ఉంటాయి పెదాలు. చాలా మంది ముఖం, శరీరంపై శ్రద్ధ పెదాలపై చాలా తక్కువగా పెడతారు. అసలు పెదాలను పట్టించుకోరు. అయితే వీటిని కూడా మంచి హోమ్ రెమిడీస్‌తో అందంగా మార్చుకోవచ్చు.

మీ పెదాలకు మంచి పోషణ, గ్లో ఇవ్వాలంటే కలబంద, పంచదార లిప్ మాస్క్‌ను ట్రై చేయవచ్చు. కలబంద గుజ్జులో.. కొద్దిగా పంచదార కలిపి పెదాలపై సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇది టాన్ పోగొట్టి.. పెదాలను ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. మంచి హైడ్రేషన్ కూడా అందిస్తుంది.

పెదాల రంగు మార్చడంలో కొబ్బరి నూనె కూడా బాగా పని చేస్తుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా పంచదార కలిపి పెదాలపై సున్నితంగా మర్దనా చేస్తే.. టాన్, మృత కణాలు పోయి.. ఎక్స్ ఫోలియేషన్ చేస్తుంది. ఇలా తరచూ చేస్తే మృదువైన, అందమైన పెదాలు మీ సొంతం అవుతాయి.

అందరికీ లభ్యమయ్యే వాటిల్లో నిమ్మ రసం కూడా ఒకటి. కొద్దిగా నిమ్మరసంలో తేనె, పందచదార కలిపి పెదాలపై మర్దనా చేసి.. ఆరేంత వరకూ అలానే ఉంచండి. ఇలా చేయడం వల్ల సహజ రంగును పొందుతారు. మెరిసే, అందమైన పెదాలను పొందవచ్చు.




