- Telugu News Photo Gallery Do you know how many uses baking soda is used in cooking? check here is details in Telugu
Kitchen Hacks: వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
బేకింగ్ సోడా గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయాలు అవసరం లేదు. అందరికీ దీని గురించి బాగా తెలుసు. వంటల్లో చాలా మంది ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. బేకింగ్ సోడాను ముఖ్యంగా బేకరీ ఐటెమ్స్, అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ ఫాస్ట్ వంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. బేకింగ్ సోడాను కేవలం వంటల్లోనే కాకుండా చాలా రాకలుగా ఉపయోగించుకోవచ్చు. పలు వస్తువులు, ఇంటిని క్లీన్ చేయడంలో బేకింగ్ సోడా అనేది చాలా ఎఫెక్టీవ్‌గా..
Updated on: Apr 23, 2024 | 10:04 PM

బేకింగ్ సోడా గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయాలు అవసరం లేదు. అందరికీ దీని గురించి బాగా తెలుసు. వంటల్లో చాలా మంది ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. బేకింగ్ సోడాను ముఖ్యంగా బేకరీ ఐటెమ్స్, అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ ఫాస్ట్ వంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు.

బేకింగ్ సోడాను కేవలం వంటల్లోనే కాకుండా చాలా రాకలుగా ఉపయోగించుకోవచ్చు. పలు వస్తువులు, ఇంటిని క్లీన్ చేయడంలో బేకింగ్ సోడా అనేది చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలీదు. బేకింగ్ సోడాతో మీ ఇంటిని మిలమిలమని మెరిపించవచ్చు.

బేకింగ్ సోడాతో మురికి, దుర్వాసనను వదిలించుకోవచ్చు. అలాగే జిడ్డు, మురికి పాత్రలు పాలిష్ చేయడంలో కూడా ఇవి ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. అలాగే ఫ్యాన్లు, కూలర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ మొలై వాటిని శుభ్రపరచడానికి కూడా బేకింగ్ సోడా బాగా పని చేస్తుంది.

బేకింగ్ సోడాతో ఇంటిని, బాత్రూమ్‌ని కూడా క్లీన్ చేయవచ్చు. షూ దుర్వాసనను కూడా బేకింగ్ సోడా తొలగిస్తుంది. ప్రస్తుతం ఎండా కాలం కావడంతో చాలా రకాల కీటకాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. వీటిని బయటకు పంపించడంలో బేకింగ్ సోడా బాగా పని చేస్తుంది.

బేకింగ్ సోడాతో నీటితో ఫ్లోర్స్ క్లీన్ చేస్తే చాలా నీటిగా ఉండటమే కాకుండా, కీటకాలు వంటివి లోపలికి రాకుండా ఉంటాయి. దుర్వాసన కూడా పోతుంది. అయితే ఇది ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బేకింగ్ సోడా కళ్లు, చర్మానికి చికాకును కలిగింవచ్చు.





























