- Telugu News Photo Gallery Do this if you want the soaps to last longer, check here is details in Telugu
Tips for Soap Longer: సబ్బులు ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి..
రోజూ మనం ఉపయోగించే నిత్యవసరాల్లో సబ్బులు కూడా ఒకటి. స్నానం చేయాలంటే ఖచ్చితంగా ఒంటి సబ్బు కావాల్సిందే. సబ్బు లేదంటే స్నానం కూడా చేయరు కొంత మంది. అదే విధంగా బట్టలు ఉతకడానికి, గిన్నెలు కడగడానికి కూడా సబ్బులు కావాలి. అయితే ఈ సబ్బులు అనేవి త్వరగా అరిగిపోతూ ఉంటాయి. దీంతో ఒకదాని తర్వాత మరొకటి ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా ఎలాంటి సబ్బులైనా ఎక్కువ రోజులు మన్నాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే..
Updated on: Apr 07, 2024 | 1:25 PM

రోజూ మనం ఉపయోగించే నిత్యవసరాల్లో సబ్బులు కూడా ఒకటి. స్నానం చేయాలంటే ఖచ్చితంగా ఒంటి సబ్బు కావాల్సిందే. సబ్బు లేదంటే స్నానం కూడా చేయరు కొంత మంది. అదే విధంగా బట్టలు ఉతకడానికి, గిన్నెలు కడగడానికి కూడా సబ్బులు కావాలి. అయితే ఈ సబ్బులు అనేవి త్వరగా అరిగిపోతూ ఉంటాయి.

దీంతో ఒకదాని తర్వాత మరొకటి ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా ఎలాంటి సబ్బులైనా ఎక్కువ రోజులు మన్నాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే.. మీకు డబ్బులు కూడా ఆదా అవుతాయి.

సబ్బు ఎక్కువ రోజులు రావలాంటే.. ముందు మీరు ఉపయోగించే సబ్బు ఏదైనా సరే ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఉపయోగించాలి అనుకున్నప్పుడు ఒక ముక్క మాత్రమే తీసుకుని వాడండి. దీంతో మిగిలిన సబ్బు తడవదు. ఇలా ఒక సబ్బును చాలా రోజులు ఉపయోగించవచ్చు.

సబ్బును తడిపారంటే.. అది త్వరగా కరిగిపోతుంది. కాబట్టి మీరు ఉపయోగించిన తర్వాత సబ్బును ఎండలో పెట్టడం లేదా బాగా ఆరిపోయే విధంగా పక్కకు ఉంచాలి. సబ్బు పొడిగా ఉంటేనే ఎక్కువ రోజులు వస్తుంది.

అలాగే హోల్స్ ఉన్న సబ్బు బాక్సులను ఉపయోగించడం వల్ల నీరు అనేది కిందకు పోతుంది. దీంతో సబ్బు త్వరగా పొడిగా మారుతుంది. సబ్బును ఎక్కువ కాలం ఉపయోగించాలంటే.. స్పాంజ్ లేదా బాత్ పౌఫ్ ఉపయోగించాలి. ఇవి చిన్న చిన్న టిప్సే అయినా.. పాటిస్తే డబ్బు ఆదా అవుతుంది.




