- Telugu News Photo Gallery Diesel cars with 5 seater under 10 lakhs in india tata nexon kia sonet hyundai i20 mahindra xuv300, here is the list
5 Seater Cars: రూ. 10 లక్షలలోపు ఎక్కువ మైలేజీని ఇచ్చే బెస్ట్ 5 సీటర్ కార్లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
కొత్త కారును కొనుగోలు చేసే ప్లాన్ ఉంటే, డీజిల్ కారు అనేది బెస్ట్ ఆప్షన్. 10 లక్షల కంటే తక్కువ ధరకు మార్కెట్లో అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి, అవన్నీ కూడా శక్తివంతమైన ఇంజన్లతో వస్తున్నాయి. ఈ వాహనాలు మెరుగైన మైలేజీని కూడా అందిస్తున్నాయి. మరి ఆ లిస్టు ఏంటో చూసేద్దాం..
Updated on: Jan 03, 2023 | 9:25 AM

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో టాటా నెక్సాన్ ఒకటి. భారతీయ మార్కెట్లో చౌకైన డీజిల్ వేరియంట్ Nexon XM డీజిల్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షలు. మైలేజీ గురించి చెప్పాలంటే, ఈ కారు 21.19 kmpl మైలేజీని ఇస్తుంది. పవర్ ట్రాన్స్‌మిషన్ కోసం, దీనికి మాన్యువల్ గేర్ బాక్స్ అమర్చబడింది.

టాటా ఆల్ట్రోజ్.. ఇది డీజిల్ ఎంపికలోనూ కార్ల తయారీ సంస్థ అందిస్తుంది. బేస్ డీజిల్ వేరియంట్ పేరు ఆల్ట్రోజ్ XE ప్లస్ డీజిల్. మార్కెట్‌లో ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.90 లక్షలు. అదే సమయంలో, ఈ టాటా సెడాన్ కారు డీజిల్‌పై 23.03 kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంది.

హ్యుందాయ్ ఐ20 ఒక గొప్ప ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. విశేషమేమిటంటే దీని డీజిల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. i20 అతి తక్కువ ధర డీజిల్ వేరియంట్ i20 మాగ్నా డీజిల్. మైలేజీ పరంగా, ఇది 25.0 kmpl మైలేజీని ఇస్తుంది. ఇండియన్ మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.43 లక్షలు. i20 డీజిల్ వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మహీంద్రా XUV300.. దీని బేస్ డీజిల్ వేరియంట్ పేరు XUV300 W4 డీజిల్. మహీంద్రా XUV300 డీజల్ వేరియంట్ 20.1 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ మోడల్ రూ. 9.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. ఇందులో మీకు మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది.

దక్షిణ కొరియా కంపెనీ కియాకు చెందిన SUV కార్లకు మంచి డిమాండ్ ఉంది. Kia Sonet SUV డీజిల్ వేరియంట్ Sonet 1.5 HTE డీజిల్. మైలేజీ గురించి చెప్పాలంటే, ఈ మోడల్ 24.1kmpl మైలేజీని ఇస్తుంది. Kia Sonet రూ. 9.05 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. ఇందులో కూడా మీకు మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది.




