- Telugu News Photo Gallery Did you dream of cutting your hair? This is what it means, here is details
Spirituality Tips: జుట్టు కత్తిరించుకున్నట్టు కల వచ్చిందా.. అయితే దానికి అర్థం ఇదే!
జుట్టు అనేది అందానికి గుర్తింపుగా చెప్పవచ్చు. ఒత్తైన.. పొడవైన జుట్టు ఉండాలని అనుకోని వారుండరు. జుట్టుతో రూపు రేఖలే మారి పోతాయి. జుట్టును అందంగా ఉంచాలని ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. అయితే కలలో ఒక్కోసారి జుట్టుకు సంబంధించిన కలలు కూడా వస్తూంటాయి. ఇలా కలలో జుట్టను కత్తిరించుకున్నట్టు కల వస్తే ఏం జరుగుతుందో అని చాలా మంది భయ పడుతూ ఉంటారు. ఇది శుభానికి సంకేతమా లేక అశుభం..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 09, 2023 | 9:15 PM

జుట్టు అనేది అందానికి గుర్తింపుగా చెప్పవచ్చు. ఒత్తైన.. పొడవైన జుట్టు ఉండాలని అనుకోని వారుండరు. జుట్టుతో రూపు రేఖలే మారి పోతాయి. జుట్టును అందంగా ఉంచాలని ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. అయితే కలలో ఒక్కోసారి జుట్టుకు సంబంధించిన కలలు కూడా వస్తూంటాయి. ఇలా కలలో జుట్టను కత్తిరించుకున్నట్టు కల వస్తే ఏం జరుగుతుందో అని చాలా మంది భయ పడుతూ ఉంటారు. ఇది శుభానికి సంకేతమా లేక అశుభం ఏమైనా జరగనుందా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి కలలో జుట్టు కత్తిరించుకున్నట్టు కల వస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

కలలో జుట్టు కత్తిరించు కోవడం వల్ల శుభం.. అశుభంగా కూడా పరిగణించుకోవచ్చు. ఎందుకంటే ఈ కల స్త్రీ, పురుషులకు భిన్నంగా ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. మగవారికి కలలో జుట్టు కత్తిరించుకున్నట్టు వస్తే శుభ సూచకంగా చెప్పవచ్చు. కానీ ఆడవారికి కలలో.. జుట్టును కత్తిరించుకున్నట్టు వస్తే మాత్రం అశుభంగా చెప్పవచ్చు.

అలాగే కలలో పొడవైన జుట్టును చూస్తే.. భవిష్యత్తులో మీకు మంచి రోజులు వస్తాయని చెప్పవచ్చు. ఇలాంటి కల వస్తే.. తక్కువ ప్రయత్నాల్లోనే చాలా ప్రయోజనాలు పొందుతారని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థానాలను తక్కువ సమయంలోనే చేరుకుంటారు.

అలాగే కలలో జుట్టును కత్తిరించే స్త్రీని చూడటం మాత్రం అశుభంగా.. స్వప్న శాస్త్రం చెబుతోంది. ఈ కల వచ్చిన వారికి.. ఆర్థిక నష్టాలు, ఇంట్లో స్త్రీ ఆరోగ్యం క్షీణించడం వంటివి జరగొచ్చు. అంతే కాకుండా కుటుంబంలో కలహాలు కూడా రావచ్చని శాస్త్రం చెబుతుంది.

అదే విధంగా స్త్రీలు జట్టును కత్తిరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గురువారం స్త్రీలు జుట్టును అస్సలు కత్తిరించకూడదు. కాగా స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతి కలకు ఓ అర్థం ఉంటుంది. కల అనేది భవిష్యత్తును సూచిస్తుంది.





























