- Telugu News Photo Gallery Diabetes Care: Include these spices in your daily diet to control your blood sugar levels
Diabetes Care: డయాబెటిస్ పేషెంట్లకు అలెర్ట్.. బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే వీటిని తీసుకోండి
Diabetes Care Tips: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకూ మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒత్తిడి, జీవనశైలి, ఆహారం వల్ల చిన్న వయస్సులోనే చాలా మందికి డయాబెటిస్ వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో (Diabetes Care Plan) చాలా జాగ్రత్తగా ఉండాలి.
Updated on: Feb 17, 2022 | 2:02 PM

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంలో వంటింట్లో కొన్ని సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కొన్ని కొన్ని పదార్థాలు ఆహారం చేర్చడం ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. దాల్చినచెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మీరు ఈ మసాలా దినుసును మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

పసుపు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ సూపర్ ఫుడ్ ఆరోగ్యకరమైన మసాలా దినుసులలో ఒకటిగా భావిస్తారు. దీన్ని ఎవరైనా తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది వ్యాధులను దూరం చేయడంతోపాటు.. యాంటిబయోటిక్‌గా పనిచేస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతులు చాలా మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. దీని కోసం 1 టీస్పూన్ మెంతులు గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది.

జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీలకర్ర కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. జీలకర్ర బరువు కూడా తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.




