జికా ప్రధాన లక్షణం జ్వరం. తేలికపాటి జ్వరంతో పాటు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, అలసట, కడుపు నొప్పి ఉంటుంది. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు, కనురెప్పల దిగువ భాగంలో మంట ఉంటుంది. జికా దోమ కుట్టిన తర్వాత 3-14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే దోమలకు దూరంగా ఉండాలి. జికాను నివారించడానికి దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. కాబట్టి ఇంటి లోపల, చుట్టుపక్కల నిల్ల నీరు లేకుండా చూసుకోవాలి. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి.