- Telugu News Photo Gallery Dandruff Problem: How Coconut Oil Helps To Solve Dandruff Problem, Know here
Coconut Oil for Dandruff: ఎన్ని ట్రై చేసినా.. చుండ్రు వదలట్లేదా? కొబ్బరి నూనెలో కాసిన్ని నిమ్మ చుక్కలు జోడించి..
జుట్టుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చుండ్రు ఓ పట్టాన వదలదు. కేవలం షాంపూ, కండిషనింగ్‌తో చుండ్రు సమస్యకు చికిత్స చేయడం సాద్యం కాదు. అందుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిజానికి, చుండ్రు వదిలించుకోవటం అంత తేలికైన పని కాదు. అది మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. అయితే చుండ్రును పోగొట్టడానికి కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందించడానికి..
Updated on: May 09, 2024 | 8:53 PM

జుట్టుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చుండ్రు ఓ పట్టాన వదలదు. కేవలం షాంపూ, కండిషనింగ్‌తో చుండ్రు సమస్యకు చికిత్స చేయడం సాద్యం కాదు. అందుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిజానికి, చుండ్రు వదిలించుకోవటం అంత తేలికైన పని కాదు. అది మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది.

అయితే చుండ్రును పోగొట్టడానికి కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందించడానికి, స్కాల్ప్‌ను ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచడానికి జుట్టులోకి లోతుగా చొచ్చుకుపోయి చికిత్స అందిస్తాయి.

కొబ్బరి నూనెతో డీప్ కండిషనింగ్ చేయడం వల్ల కూడా డ్రై స్కాల్ప్ నుంచి ఉపశమనం పొందవచ్చు. చుండ్రుకు ప్రధాన కారణం డ్రై స్కాల్ప్. కొబ్బరి నూనెతో ఆయిల్ మసాజ్ చేయడం వల్ల దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. జుట్టు పొడవును బట్టి కొబ్బరి నూనెను వేడి చేసుకోవాలి. గోరువెచ్చని నూనెతో తల మొత్తం మసాజ్ చేసుకోవాలి.

నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ జుట్టు pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే స్కాల్ప్‌ను ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. నాణ్యమైన కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపితే రాసుకుంటే చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్ తలలో ఉత్పత్తి అయ్యే సహజ నూనెల కూర్పుకు చాలా పోలిక ఉంటుంది! కాబట్టి చాలా మంది డ్రై స్కాల్ప్ చికిత్సకు ఆలివ్ నూనెను కూడా ఉపయోగిస్తారు. చుండ్రుతో పాటు, తలపై దురద కూడా ఉంటే కొబ్బరి నూనెతో పాటు రోజ్మేరీ నూనె కూడా వినియోగించాలి. ఐదు నుంచి ఆరు చుక్కల రోజ్‌మేరీ ఆయిల్‌తో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట అలాగే ఉంచి, తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే క్రమంగా చుండ్రు, దురద సమస్య తొలగిపోతుంది.




