చెన్నై సూపర్ కింగ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో, ధోనీ భవిష్యత్తు గురించి లేవనెత్తిన ప్రశ్నలకు టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ సమాధానమిచ్చారు. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడుతాడా లేదా అనేది నేను చెప్పలేనంటూ తెలిపాడు. మేం ఈ నిర్ణయాన్ని అతనికే వదిలేశాం. అయితే, అతను వచ్చే ఐపీఎల్ సీజన్‌లో చెన్నైకి ఆడతాడని మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఇది నేను, అతని అభిమానులు కూడా నమ్ముతున్నాం.