- Telugu News Photo Gallery Cricket photos SRH vs RR, IPL 2024: Will Hyderabad add Glenn Phillips to the team as an all rounder to give extra depth
SRH vs RR: టైం వచ్చింది కావ్యాపాపా.. రాజస్థాన్‌పై ఆ పాశుపతాస్త్రాన్ని సంధించాల్సిందే.. బెంచ్‌లో కూర్చోబెట్టింది చాల్లే..
ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో మరో కీలక మ్యాచ్‌కు వేళయింది. క్వాలిఫయర్-2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నేడు మరికొద్దిసేపట్లో మొదలు కానుంది. ఈ గేమ్‌లో గెలిచిన టీం ఆదివారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఫైనల్ ఆడాల్సి ఉంటుంది.
Updated on: May 24, 2024 | 6:09 PM

ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో మరో కీలక మ్యాచ్‌కు వేళయింది. క్వాలిఫయర్-2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నేడు మరికొద్దిసేపట్లో మొదలు కానుంది. ఈ గేమ్‌లో గెలిచిన టీం ఆదివారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఫైనల్ ఆడాల్సి ఉంటుంది.

ఇక ఓడిపోయిన టీం 3వ ప్లేస్‌తో ట్రోర్నీకి గుడ్‌బై చెప్పనుంది. లీగ్ స్టేజిలో దుమ్మురేపిన హైదరాబాద్ జట్టు.. కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్-1లో ఘోర పరాజయం చవి చూసింది. అన్ని విభాగాల్లో చెత్త ప్రదర్శనతో గల్లీ జట్టులా మారిపోయింది.

క్వాలిఫయర్-1లో పరాజయంతో మరో ఛాన్స్ దక్కించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫయర్-2లో తన లక్ చెక్ చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్లనుండగా.. ఓడిపోతే మాత్రం గుడ్‌బై చెప్పాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆరెంజ్ ఆర్మీకి డూ ఆర్ డైలా మారింది.

క్వాలిఫయర్-1లో ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో హైదరాబాద్ ఏదశలోనూ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగలేదు. మిడిలార్డర్, ఫినిషర్లు కాస్త రాణించడంతో ఆ మాత్రమైనా స్కోర్ చేసింది. ఈ క్రమంలో ఓ సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఇన్నాళ్లు బెంచ్‌కే పరిమితమైన ఆటగాడిని రంగంలోకి దింపాలని అంతా కోరుతున్నారు. ఆ ఆటగాడి పేరే గ్లెన్ ఫిలిప్స్. ఈ డేంజరస్ హిట్టర్ తన అసాధారణ ఆటతో కివీస్‌కు పొట్టి ఫార్మాట్‌లో ఎనలేని విజయాలు అందించాడు. కాగా, ఈ ప్లేయర్ తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు.

ఈ ఆల్ రౌండర్‌ను బరిలోకి దింపాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ ప్లేయర్‌తో బరిలోకి దిగితే విజయం తప్పక వస్తుందని అంటున్నారు. ఇదే సరైన సమయం అని, చెన్నైలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సరైన మొనగాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక చెపాక్‌లో ఆరెంజ్ ఆర్మీ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ను టై చేసుకున్న హైదరాబాద్.. మరి నేడు ఎలా రాణిస్తుందో చూడాలి.





























