- Telugu News Photo Gallery Cricket photos LSG Coach Lance Klusener Reacts On KL Rahul Sanjiv Goenka Issue
IPL 2024: లక్నోను వీడనున్న కేఎల్ రాహుల్? ఆ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన కోచ్..
IPL 2024: ఇప్పుడు, సంఘటన జరిగిన వారం తర్వాత, లక్నో సూపర్‌జెయింట్స్ అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్ ప్రస్తుత పరిణామాలపై తన మౌనాన్ని వీడారు. నిజానికి ఈ ఘటన తర్వాత రాహుల్‌ని నాయకత్వం నుంచి తప్పించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
Updated on: May 14, 2024 | 6:41 AM

గతవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత లక్నో యజమాని సంజీవ్ గోయెంకా.. కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వివాదం కూడా చెలరేగింది. అదేవిధంగా రాహుల్‌కు మద్దతు ఇస్తూ గోయెంకా ప్రవర్తనను కొందరు మాజీ ఆటగాళ్లు విమర్శించారు. అలాగే అభిమానులు రాహుల్‌ను లక్నో టీమ్‌ను విడిచిపెట్టాలని అభ్యర్థించారు.

ఇప్పుడు, సంఘటన జరిగిన వారం తర్వాత, లక్నో సూపర్‌జెయింట్స్ అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్ ప్రస్తుత పరిణామాలపై తన మౌనాన్ని వీడారు. నిజానికి ఈ ఘటన తర్వాత రాహుల్‌ని నాయకత్వం నుంచి తప్పించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇద్దరు క్రికెట్ ప్రేమికుల మధ్య ఈ చర్చలో ఎటువంటి సమస్య లేదని అన్నారు. మేం జట్టులో ఇలాంటి సంభాషణలను ఇష్టపడతాం. ఇది జట్ల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మాకు పెద్ద సమస్య కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

రాహుల్ పరుగుల లేమి గురించి మాట్లాడుతూ, 'రాహుల్‌కు తనదైన ప్రత్యేక శైలి ఉంది. అది అతన్ని గొప్ప క్రికెటర్‌గా మార్చింది. ఈ ఐపీఎల్ అతనికి కష్టమైంది. ఎందుకంటే మా జట్టు ప్రతి మ్యాచ్‌లో నిరంతరం వికెట్లు కోల్పోతుండడంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం రాలేదు.

రాహుల్ ఈ ఎడిషన్‌లో ఒకటి లేదా రెండు సెంచరీలు సాధించాలనుకున్నాడు. కానీ, జట్టు పేలవ ప్రదర్శన కారణంగా అది జరగలేదు. అతను త్వరలో పెద్ద ఇన్నింగ్స్ ఆడతానని ఆశిస్తున్నాను అంటూ చాలా కాలంగా ఉన్న అనేక పుకార్లను కొట్టిపారేశాడు.




