- Telugu News Photo Gallery Cricket photos IPL 2024 Playoffs: Exact Margin RCB Need To Beat CSK In Top 4 Race
IPL 2024: ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే చెన్నైపై ఎన్ని పరుగుల తేడాతో గెలవాలో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో 62 మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మ్యాచ్‌లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి CSK జట్టుకు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం.
Updated on: May 14, 2024 | 8:34 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో 62 మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మ్యాచ్‌లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి CSK జట్టుకు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం.

మే 18న జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో 3వ లేదా 4వ స్థానంలో కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్న CSKపై గొప్ప విజయం సాధిస్తేనే RCB టాప్-4 చేరుకోగలదు.

CSK జట్టు నెట్ రన్ రేట్ +0.528గా ఉన్నందున, RCB జట్టు ఈ నెట్ రన్ రేట్‌ను అధిగమించి 14 పాయింట్లను సంపాదించాలి. మరి +0.387 నెట్ రన్ రేట్‌తో ఉన్న RCB ఎంత మార్జిన్‌తో CSKని ఓడించాలో తెలుసుకుందాం రండి.

CSKతో జరిగే మ్యాచ్‌లో RCB ముందుగా బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. ఉదాహరణకు RCB స్కోర్ 200 పరుగులు చేస్తే, CSK తప్పనిసరిగా 182 లేదా అంతకంటే తక్కువ పరుగులకే పరిమితం చేయాలి. దీని ద్వారా కనీసం 18 పరుగుల విజయాన్ని సాధించాలి

ఒకవేళ ముందుగా సీఎస్కే ముందుగా బ్యాటింగ్ చేస్తే, ఆర్సీబీ కేవలం 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. ఉదాహరణకు, CSK 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే, RCB 18.1 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించాలి.

ఈ రెండు లెక్కలతో RCB జట్టు CSKతో పోటీపడనుంది. ఈ తేడాతో గెలిస్తేనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్‌ను అధిగమించి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించగలదు.