- Telugu News Photo Gallery Cricket photos IPL 2025 9 Seasons, 15+ Wickets Each Check Jasprit Bumrah's IPL Dominance IPL History
IPL 2025: 9 సీజన్లుగా తగ్గేదేలే.. ఐపీఎల్ హిస్టరీలో సరి కొత్త చరిత్ర సృష్టించిన బుమ్రా.. అదేంటంటే?
Jasprit Bumrah's IPL Dominance: ఐదుసార్లు ఛాంపియన్లు ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన. గత 9 ఐపీఎల్ సీజన్లలో వరుసగా 15 కి పైగా వికెట్లు తీసిన రికార్డు బుమ్రా పేరిట ఉంది. బుమ్రా ఎకానమీ రేటు కూడా ముంబై విజయానికి దోహదపడింది.
Updated on: May 23, 2025 | 3:17 PM

Jasprit Bumrah's IPL Dominance: ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్‌ల్లో చాలా పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టు, గత 8 మ్యాచ్‌ల్లో 7 గెలిచి ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ముంబై జట్టు ఈ విజయానికి కారణం జస్‌ప్రీత్ బుమ్రా అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ సీజన్‌లో బుమ్రా ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టి, ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 9 సీజన్లలో అద్భుతంగా రాణించిన ఏకైక బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. అతను వరుసగా 9 సీజన్లలో 15 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాడు.

2016 నుంచి తన విజయ పరంపరను కొనసాగిస్తున్న బుమ్రా, అప్పటి నుంచి ప్రతి ఎడిషన్‌లోనూ 15 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 2017లో 20 వికెట్లు తీసిన బుమ్రా, 2018లో 17 వికెట్లు, 2019లో 19 వికెట్లు పడగొట్టాడు.

2020లో 27 వికెట్లు తీసిన బుమ్రా తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యుత్తమ సంవత్సరాన్ని గడిపాడు. ఆ తర్వాత 2021లో 21 వికెట్లు తీసిన బుమ్రా.. 2022లో 15 వికెట్లు, 2024లో 20 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టాడు.

బుమ్రా వికెట్లు పడగొట్టడం ఒక్కటే కాదు. ఎకానమీ రేటు కూడా అద్భుతంగా ఉంది. గత 9 సీజన్లలో 5 సీజన్లలో బుమ్రా ఎకానమీ రేటు ఓవర్‌కు 7 పరుగుల కంటే తక్కువగా ఉంది. పెద్ద విషయం ఏమిటంటే బుమ్రా ఎప్పుడూ 8 ఎకానమీ రేటుతో పరుగులు ఇవ్వలేదు. బుమ్రా గణాంకాలు నిజంగా అద్భుతమైనవి.

ఢిల్లీ క్యాపిటల్స్‌ను 59 పరుగుల తేడాతో ఓడించి ముంబై ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. మొదట్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ముంబై.. ఆ తర్వాత అద్భుతమైన పునరాగమనం చేసి, వరుసగా 6 మ్యాచ్‌లను గెలిచి నాకౌట్ రౌండ్‌లోకి ప్రవేశించింది.




