- Telugu News Photo Gallery Cricket photos IPL 2024 RCB Player Virat Kohli Breaks Suresh Rainas Record For Most Catches By An Indian In T20 Cricket
IPL 2024: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. అదేంటో తెలుసా?
Virat Kohli Records: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 ఆరో మ్యాచ్‌లో RCB స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన పేరిట భారీ రికార్డును లిఖించుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
Updated on: Mar 25, 2024 | 10:32 PM

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న ఐపీఎల్ 2024 ఆరో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన పేరిట భారీ రికార్డును నమోదు చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

పంజాబ్, ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్, జానీ బెయిర్‌స్టో వికెట్లు తీసి షాక్ ఇచ్చారు. సిరాజ్ వేసిన బంతిని సిక్సర్ కొట్టే ప్రయత్నంలో బెయిర్ స్టో కింగ్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

బెయిర్‌స్టో ఈ క్యాచ్ పట్టడం ద్వారా విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో తన 173వ క్యాచ్‌ని పూర్తి చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

గతంలో ఈ రికార్డు సురేష్ రైనా పేరిట ఉండేది. సురేష్ రైనా తన టీ20 కెరీర్‌లో 172 క్యాచ్‌లు పట్టాడు. ఇప్పుడు రైనా రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ మొదటి స్థానానికి చేరుకోగా, 167 క్యాచ్‌లు పట్టిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 108 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఎడిషన్‌లో కోహ్లీ మరో రెండు క్యాచ్‌లు తీసుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా పేరిట ఉంది. సురేష్ రైనా ఐపీఎల్‌లో మొత్తం 109 క్యాచ్‌లు పట్టాడు. అలా విరాట్ కోహ్లీ మరో 2 క్యాచ్‌లు తీసుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు.

ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 103 క్యాచ్‌లు అందుకున్న సురేశ్ రైనా, విరాట్ తర్వాత కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు.




