- Telugu News Photo Gallery Cricket photos RCB vs PBKS, IPL 2024: RCB Player Virat Kohli records 100th fifty plus score in T20 cricket check 1st place
Virat Kohli: టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్.. గేల్, వార్నర్ జాబితాలో చోటు..
Virat Kohli Records: అయితే విరాట్ కోహ్లీ జీరోకే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సామ్ కర్రాన్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో క్యాచ్ మిస్ చేశాడు. లైఫ్ దక్కించుకున్న విరాట్.. చెలరేగిపోయాడు. 31 బంతుల్లోనే ఐపీఎల్‌లో 51వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.
Updated on: Mar 26, 2024 | 8:20 AM

RCB vs PBKS, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేయర్ విరాట్ కోహ్లి టీ20ల్లో తన 100వ ఫిఫ్టీ ప్లస్ స్కోరును నమోదు చేశాడు.

అయితే విరాట్ కోహ్లీ జీరోకే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సామ్ కర్రాన్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో క్యాచ్ మిస్ చేశాడు. లైఫ్ దక్కించుకున్న విరాట్.. చెలరేగిపోయాడు. 31 బంతుల్లోనే ఐపీఎల్‌లో 51వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

టీ20 క్రికెట్‌లో కోహ్లి ఎనిమిది సెంచరీలు, 92 అర్ధ సెంచరీలు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, 37 అర్ధసెంచరీలు అంతర్జాతీయంగా వచ్చాయి.

క్రిస్ గేల్ ఈ ఫార్మాట్‌లో 110 యాభై-ప్లస్ స్కోర్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ రెండవ స్థానంలో ఉన్నాడు. అతని పేరుతో 109 హాఫ్ సెంచరీ స్కోర్లు ఉన్నాయి. కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.

కోహ్లి దూకుడుతో(58 బంతుల్లో 77) RCB 177 పరుగుల ఛేదనలో విజయం సాధించింది. అయితే, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.




