- Telugu News Photo Gallery Cricket photos Icc womens odi player rankings mithali raj smriti mandhana in top
ICC Rankings: మిథాలీ రాజ్ టాప్ 3లో కొనసాగుతుండగా.. స్మృతి మంధాన ఆరో స్థానంలో..
ICC Rankings: ఐసీసీ వన్డే మహిళల ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన మిథాలీ రాజ్, స్మృతి మంధాన మూడు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నారు. వన్డే బౌలర్లలో
Updated on: Nov 17, 2021 | 5:58 AM

ఐసీసీ వన్డే మహిళల ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన మిథాలీ రాజ్, స్మృతి మంధాన మూడు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నారు. వన్డే బౌలర్లలో వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి రెండో స్థానంలో ఉండగా, ఆల్ రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఐదో స్థానంలో ఉంది.

పాకిస్థాన్‌పై సెంచరీ చేయడంతో వెస్టిండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌ని మెరుగుపరుచుకుంది. రెండు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకుంది.

వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్ నాలుగు స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌కు చేరుకోగా, బౌలర్లలో ఆమె మూడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌కు చేరుకుంది. ఆల్ రౌండర్ల జాబితాలో రెండు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌లో ఉంది.

బ్యాట్స్‌మెన్ జాబితాలో పాకిస్థాన్ తరఫున అలియా రియాజ్ మూడు స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌కు, ఒమైమా సొహైల్ రెండు స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బౌలర్లలో నష్రా సంధు ఒక స్థానం ఎగబాకి 21వ ర్యాంక్‌కు, అనమ్ అమిన్ నాలుగు స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్‌కు చేరుకున్నారు.

బంగ్లాదేశ్‌కు చెందిన ఫర్జానా హక్ ఏడు స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరుకుంది. బౌలర్లలో కెప్టెన్ సల్మా ఖాతూన్ ఐదు స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకుంది.





























