- Telugu News Photo Gallery Cricket photos Go and take on the world.. Pat Cummins recalls mother’s inspiring words: SRH all aim to lift IPL Trophy
SRH: ఆడు మనిషి కాదు.. మాన్‌స్టర్.. బరిలోకి దిగితే ప్రత్యర్ధుల చెమడాలు వలిచేస్తాడంతే.!
ప్యాట్ కమిన్స్.. ఆస్ట్రేలియా జాతీయ జట్టు కెప్టెన్సీ అందుకునేంత వరకు ఈ పేరు పెద్దగా అందరికీ పరిచయం కాదు. కేవలం ఓ టెస్ట్ బౌలర్‌గానే ప్రపంచమంతటికి తెలుసు. ఆ తర్వాతే తనకంటూ క్రికెట్ చరిత్రలో సెపరేట్ పేజీలను లిఖించుకున్నాడు ప్యాట్ కమిన్స్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. భారత్ వేదికగా జరిగిన...
Updated on: May 26, 2024 | 11:07 AM

ప్యాట్ కమిన్స్.. ఆస్ట్రేలియా జాతీయ జట్టు కెప్టెన్సీ అందుకునేంత వరకు ఈ పేరు పెద్దగా అందరికీ పరిచయం కాదు. కేవలం ఓ టెస్ట్ బౌలర్‌గానే ప్రపంచమంతటికి తెలుసు. ఆ తర్వాతే తనకంటూ క్రికెట్ చరిత్రలో సెపరేట్ పేజీలను లిఖించుకున్నాడు ప్యాట్ కమిన్స్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను తన ఖాతాలో వేసుకుని కొత్త చరిత్రను సృష్టించాడు. ఇక ఇప్పుడు వరుసగా మూడో ట్రోఫీని ముద్దడడానికి సిద్దంగా ఉన్నాడు.

ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్. లీగ్ స్టేజిలో ఆధిపత్యం చూపించిన ఈ జట్లు.. ఫైనల్స్‌లో భీకర యుద్దానికి సిద్దమయ్యాయి.

ఒకవైపు కూల్‌గా ప్రత్యర్ధులను తాటతీసే గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుంటే.. మరోవైపు క్రౌడ్ అంతటిని పిన్ డ్రాప్ సైలెన్స్ చేసే ప్యాట్ కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

టోర్నీ అంతటా ప్యాట్ కమిన్స్ తనదైన మార్క్ చూపించాడు. జట్టులో దూకుడైన ఆటతీరును తీసుకొచ్చి.. ప్రత్యర్ధులలో వణుకు పుట్టించాడు. అలాగే ఎప్పటికప్పుడూ వ్యూహాలను మారుస్తూ.. మిగతా టీంలను కంగారు పుట్టించాడు.

దాదాపు ఈ ఏడాది సన్‌రైజర్స్ మూడు రికార్డు స్కోర్లు సాధించడమే కాదు.. ఓపెనింగ్‌లో ట్రావిస్ హెడ్ మెరుపులు, అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం.. కమిన్స్ సారధ్యంలో జరగడం విశేషం.

"ప్యాట్, వెళ్లి ప్రపంచాన్ని నీ వశం చేసుకో. ఈ అద్భుతాన్ని ఎవరైనా వెళ్లి చేయబోతున్నారు. ఎందుకని నువ్వు అది అవకూడదు' అని కమిన్స్ తన తల్లి చెప్పిన మాటలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.

మినీ వేలంలో అన్ని కోట్లు పోసి ప్యాట్ కమిన్స్‌ను.. కావ్య పాప కొనుగోలు చేస్తే.. మిగతా ఫ్రాంచైజీల ఓనర్లు ఆమె నిర్ణయానికి నవ్వుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రతీ ఒక్కరికి సరైన సమాధానం ఇస్తున్నాడు ప్యాట్ కమిన్స్. వెళ్లి ప్రపంచాన్ని ఏలు సామీ.. నువ్వు ఇలా తలుచుకో.. ఐపీఎల్ ట్రోఫీ మనదే అవుతుందని.. SRH ఫ్యాన్స్, ఆరెంజ్ ఆర్మీ.. కమిన్స్ సైన్యానికి పూర్తి మద్దతు ఇస్తున్నారు.




