- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024 Virat Kohli Not Travelling With Indian Team 1st Batch Due to Delay in Visa Paperwork
Virat Kohli: కోహ్లీ మిస్సింగ్.. టీమిండియాతో కలిసి అమెరికాకు వెళ్లని రన్ మాస్టర్.. కారణం ఏంటంటే?
T20 World Cup 2024: T20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. అలాగే జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Updated on: May 26, 2024 | 11:21 AM

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు తొలి బ్యాచ్ అమెరికాకి బయలుదేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శివమ్ దూబేతోపాటు మరికొంతమంది ఆటగాళ్లు ఉన్న ఈ బ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కనిపించలేదు.

Virat Kohli

మే 30 తర్వాత విరాట్ కోహ్లి అమెరికా పర్యటనకు వెళితే ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమవుతాడు. జూన్ 1న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. అంతకు ముందే అతను టీమ్ ఇండియాను చేరే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా తొలి బ్యాచ్ ఆటగాళ్లతో కలిసి వెళ్లలేదు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న హార్దిక్ అక్కడి నుంచి నేరుగా జట్టులో చేరాలని భావిస్తున్నాడు.

ఈసారి టీ20 ప్రపంచకప్ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 4న ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అలాగే జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ అర్ష్దీప్ సింగ్ , మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. ||రిజర్వ్ ప్లేయర్లు: శుభమాన్ గిల్, అవేష్ ఖాన్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్.




