చలికాలంలో పాదాలు పొడిబారడం, మడమలు పగిలిపోవడం చాలా సాధారణ సమస్యలు. ఈ కాలంఓ వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. దీని వల్ల చర్మం పగుళ్లు ఏర్పడుతుంది. మరోవైపు కాలుష్యం కూడా ప్రభావం చూపుతుంది. చలికాలంలో పాదాలకు ఎక్కువ ధూళి అంటుకుంటుంది. కాబట్టి పాదాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా పాదాలను వేడి నీటిలో కడుక్కుని, క్రీమ్ రాసుకోవాలి. అప్పుడే పాదాలు మృదువుగా ఉంటాయి. మీరు ఇంట్లో కూడా ఈ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.