- Telugu News Photo Gallery What is 'Nabhi Marma'? Amazing benefits with this trick, check here is details in Telugu
Nabhi Marma Benefits: ‘నాభి మర్మం’ అంటే ఏంటి? ఈ ట్రిక్ తో అమేజింగ్ బెనిఫిట్స్..
శీతా కాలంలో ఉదయం 11 గంటలు అయ్యేంత వరకూ కూడా.. వాతావరణం చల్లగానే ఉంటుంది. శరీరం మరీ కూల్ అయిపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి బాడీకి సరైన టెంపరేచర్ ఇవ్వాలి. దీంతో ఆహారాల నుంచి దుస్తుల వరకూ కూడా చలి కాలంలో అన్నింటిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇలా శరీరానికి వెచ్చదనం తీసుకు రావడంలో 'నాభి మర్మం'అనే టిప్ బాగా సహాయ పడుతుంది. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 25, 2023 | 10:03 PM

శీతా కాలంలో ఉదయం 11 గంటలు అయ్యేంత వరకూ కూడా.. వాతావరణం చల్లగానే ఉంటుంది. శరీరం మరీ కూల్ అయిపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి బాడీకి సరైన టెంపరేచర్ ఇవ్వాలి. దీంతో ఆహారాల నుంచి దుస్తుల వరకూ కూడా చలి కాలంలో అన్నింటిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇలా శరీరానికి వెచ్చదనం తీసుకు రావడంలో 'నాభి మర్మం'అనే టిప్ బాగా సహాయ పడుతుంది. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాభి మర్మం చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా మెరుగు పడుతుంది. ఈ వింటర్ సీజన్ లో నాభిపై ఆవ నూనె రాసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచేందుకు ఆవ నూనె కీలక పాత్ర పోషిస్తాయి.

అదే విధంగా పలు దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేయకుండా శరీరాన్ని కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే చాలా మంది ఈ శీతా కాలంలో కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ముందు నాభి చుట్టూ ఆవ నూనెతో మర్దనా చేసుకోవాలి.

ఆ తర్వాత నొప్పులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వింటర్ సీజన్ లో ప్రతి రోజూ చేయడం వల్ల శాశ్వతంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొంద వచ్చు.

అలాగే ఈ సీజన్ లో ఎక్కువగా చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. చర్మం పొడి బారడం, దురద, పగలడం, మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వారు నాభి చుట్టూ ఆవ నూనెను రాసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ అంది, కాంతి వంతంగా తయారవుతుంది.





























