వాస్తవానికి, రోజూ పరిమితికి మించి గుడ్లు తీసుకుంటే, మీ బరువు పెరుగుతుంది. అది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా సృష్టిస్తుంది. అందుకే అధికంగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్లు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు.